Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరివేపాకు చూర్ణాన్ని మజ్జిగలో కలిపి తీసుకుంటే..?

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (14:36 IST)
రాజకీయాల్లో తమను కరివేపాకుల్లా వాడి పారేశారని కొందరు నేతలు తరచూ వాపోతుండటాన్ని వింటుంటాం. ఆ మాటల్లో సైతం కరివేపాకును ఎంత చిన్న చూపు చూస్తున్నామో తెలుస్తోంది. అయితే దానిని సరైన రీతిలో వాడుకుంటే ఎలాంటి వ్యాధులనైనా.. వైద్యుల అవసరం లేకుండానే పరిష్కిరించుకోవచ్చును. కానీ, విషయాన్ని మాత్రం ఎవ్వరూ అంతగా పట్టించుకోరు. కరివేపాకులోని ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పక మంచి ఫలితాలు లభిస్తాయి.
 
1. కరివేపాకును పచ్చడిగానో లేదా విడిగానో తీసుకోవచ్చను. అలాకాకుంటే కరివేపాకు రసాన్ని మజ్జిగలో కలుపుకుని రోజూ తాగితే జీర్ణాశయం చక్కగా పని చేస్తుంది.
 
2. వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు రోజూ ఉదయం పది నుండి పదిహేను కరివేపాకులను నమిలి తినాలి. ఇలా నెలరోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మధుమేహ వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. 
 
3. కడుపులో వికారంగా ఉన్నప్పుడు, వాంతులు అవుతున్నపుడు.. రెండు చెంచాల కరివేపాకు రసంలో కొద్దిగా నిమ్మరసం, పంచదార కలిపి తీసుకుంటే ఇలాంటి సమస్యల రావు.
 
4. కరివేపాకు బాగా ఎండబెట్టుకుని పొడిచేసి అందులో కొద్దిగా తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడివేడి అన్నంలో కలిపి సేవిస్తే విరోచనాలు తగ్గుతాయి. 
 
5. కాలిన గాయాల మీద కరివేపాకు నూరి కట్టుకడితే గాయాలు త్వరగా తగ్గుముఖం పడతాయి. 
 
6. కరివేపాకు రసాన్ని పురుగులు కుట్టిన ప్రాంతాల్లో రాసుకుంటే దద్దుర్లు తగ్గిపోతాయి.
 
7. కరివేపాకును ముద్దగా నూరి, చెంచాడు ముద్దను గ్లాస్ మజ్జిగలో కలిసి తీసుకుంటే కడుపులో వికారాన్ని నివారించవచ్చు. గర్భవతులకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments