Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజీర్తి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..?

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (15:57 IST)
కొందరికి అజీర్తి వలన కడుపునొప్పి, కడుపు మంట, వాంతులు రావడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అజీర్తి తొలగించడానికి టానిక్‌లు, మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎటువంటి ఫలితం కనిపించదు. కనుక ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది.. మరి అవేంటో తెలుసుకుందాం...
 
బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచిదో వాటి గింజలు ఆరోగ్యానికి అంత మంచివి. ఎలా అంటే.. బొప్పాయి గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని ఈ పొడిని పైనాపిల్ ముక్కలపై చల్లుకుని ప్రతిరోజూ ఉదయాన్నే సేవిస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అలానే ఆకుపచ్చని యాలకులు, సోంపు గింజలు దాల్చిన చెక్కలను నూనెలో బాగా వేయించుకోవాలి. 
 
ఆ తరువాత వాటిని పొడిచేసుకోవాలి. ఈ పొడిని రోజూ వేడివేడి అన్నంలో కలుపుకుని తీసుకుంటే అజీర్తి సమస్య తొలగిపోతుంది. అల్లం ఆరోగ్యానికి ఔషధం. కనుక అల్లాన్ని మెత్తగా నూరుకుని అందులో కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని వేసి, కొన్ని నీళ్ళు పోసి కాసేపు మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజు రెండుపూటలా తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది. 
 
రోజూ మీరు తీసుకునే ఆహారంలో బీన్స్, కాఫీ, టీ, నిమ్మ, ఆరెంజ్ జ్యూస్ వంటివి ఉండేలా చూచుకోవాలి. అప్పుడే అజీర్తి సమస్య రాదు. కడుపులో చెడు పదార్థాలు అధికంగా ఉన్నా కూడా కడుపులో మంటగా ఉంటుంది. అందువలన ఉదయాన్నే ఇలా చేస్తే.. మంచి ఉపశమనం లభిస్తుంది. నల్లజీలకర్రలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే కడుపులోని మంట తగ్గుతుంది. దాంతో అజీర్తి సమస్య కూడా తొలగిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments