తేనె విభిన్న ప్రయోజనాలను కలిగి ఉంటుంది. గాయాలు, పుళ్లు మానడానికి ఉపకరిస్తుంది. ఎందుకంటే దీనిలో గాయాలను మాన్చే గుణం ఉన్నది. దీని పీహెచ్ 3.2 నుంచి 4.5 దాకా ఉండటం వల్ల శరీరంలోకి వచ్చిన బ్యాక్టీరియాను అదుపు చేస్తుంది.
కంటికి అవసరమైన విటమిన్ "ఎ"ను శరీరం తీసుకునేందుకు సాయపడుతుంది. ఇది శరీరపు శక్తిని ఇనుమడింపజేస్తుంది. మానసిక ప్రశాంతతను, సహజమైన నిద్రను ఇస్తుంది. తేనె కలిపిన నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు తగ్గుతాయి.
మరికొన్ని చిట్కాలు...
రోజూ పావు గ్లాసు గోరు వెచ్చటి నీళ్లలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే ఒళ్లు తగ్గుతుంది. రాత్రిళ్లు తేనె కలుపుకున్న పాలు తాగితే చక్కటి నిద్ర వస్తుంది.
నిమ్మకాయ రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే కడుపు ఉబ్బరం, నొప్పి తగ్గుతుంది. వేడి నీటిలో తేనె, నిమ్మరసం పది చుక్కలు వేసుకుని తాగితే ఆయాసం తగ్గుతుంది. తేనె, తులసి ఆకురసం తీసుకుంటే.. దగ్గు, శ్లేష్మం తగ్గుతుంది.
తేనెలో కొంచెం మిరియాలపొడి కలుపుకుని తీసుకుంటే జలుబు తగ్గుతుంది. రెండు చెంచాల తేనెలో కోడిగుడ్డులోని తెల్లని సొన, కొంచెం శనగపిండి కలుపుకుని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది.