Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరపకాయను నూనెలో మరిగించి.. ఇలా చేస్తే..?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (10:51 IST)
సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది తెగ భయపడిపోతుంటారు. తినలేమంటూ వంటలో వాడినా పక్కన పడేస్తుంటారు. అయితే మిరపకాయలు తింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ప్రధానంగా మిరపకాయ మూత్ర వ్యాధులు గల వారికి హాని కలిగిస్తుంది. వారు మిరపకాయలకు దూరంగా ఉండడమే మంచిది. 
 
మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో మరిగించి.. ఆ నూనెను శరీరానికి పూతగా రాసుకుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడుతాయి. ఒక గ్లాస్ నీటిలో గులాబీ పువ్వులు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. పావు కేజీ ఆముదంలో రెండు ఎండు మిరపకాయలు వేసి మరిగించి చల్లారిన తరువాత కీళ్లకు మర్థనా చేసుకుంటే నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ నూనెను ఎక్కువగా పూసి రుద్దుతుంటే బొబ్బలెక్కే ప్రమాదముంది. మితంగా వాడుకోవాలి.
 
మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. ఆహారాన్ని పచనం జేసి, విరేచనాన్ని కలిగిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దెబ్బ తగిలినపుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉంది. కొద్ది కారము, దానికి సమానంగా ఇంగువ, పిప్పరమెంతులను కలిపి అజీర్తి విరేచనాలతో బాధపడేవారికి రోజుకు 2-3 పర్యాయాలు కొద్దిగా రాస్తుంటే విరేచనాలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments