Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధుమేహానికి.. శృంగారానికి లింక్ ఏంటీ..?

మధుమేహానికి.. శృంగారానికి లింక్ ఏంటీ..?
, శుక్రవారం, 28 డిశెంబరు 2018 (10:32 IST)
మధుమేహం వ్యాధి దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోయి అంగస్తంభన సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను అధిగమించి శృంగారంలో సమర్థవంతంగా పాల్గొనాలంటే ఏం చేయాలీ...
 
మధుమేహ నియంత్రణలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ వద్దు. రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవడం ప్రధానం. చికిత్స ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. రోజూ ఉదయాన్నే కనీసం 5 నుంచి 6 కిలోమీటర్లు కాస్త వేగంగా నడవండి. ఇది కేవలం లైంగిక సామర్థ్యాన్ని పెంచటానికే కాదు... మధుమేహం నియంత్రణలో ఉండటానికి, చక్కటి ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది.
 
రోజూ సైక్లింగ్, ఈత.. ఈ రెండూ లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. పొత్తికడుపు, కటి ప్రాంత కండరాలను బలోపేతం చేసే కపాల భాతి, సర్వాంగాసనం వంటివి సాధన చేయండి. రోజూ తప్పనిసరిగా ఆకుకూరలు, పచ్చి కూర ముక్కలు, తీపి తక్కువుండే బొప్పాయి వంటి పండ్లు తీసుకోండి. ఏడెనిమిది బాదం పప్పులు, ఖర్జూర పండ్ల వంటివి తీసుకోండి. సాధ్యమైనంత వరకూ బీఫ్, మటన్ వంటి మాంసాహారాన్ని తగ్గించండి.
 
ముఖ్యమంగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దరిచేరనీయవద్దు. భాగస్వామితో ఆహ్లాదంగా గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించండి. సమయానికి ఆహారం, చక్కటి వ్యాయామం, క్రమశిక్షణ పాటించడం, లైంగిక సామర్థ్యం తగ్గకుండా చూసుకోవడానికి దోహదం చేస్తాయి. ఎప్పుడైనా శృంగార భావనలు పెంపొందిచే సినిమాలు చూడటం కూడా మంచిదే. పొగతాగే అలవాటు ఉంటే తక్షణమే మానేయాలి. అదేవిధంగా బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తే శృంగార స్వర్గమయం అవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెదవులు పొడిబారి పగులుతుంటే... శీతాకాలం చిట్కాలు