శీతాకాలంలో పాదాలు, పెదవుల సంరక్షణ కోసం ఏం చేయాలంటే.. బొప్పాయి గుజ్జును పగుళ్లున్న చోట బాగా రుద్ది మసాజ్ చేయాలి. కాసేపయ్యాక తిరిగి నీటిలో కాళ్లను ఉంచి మళ్లీ బాగా రుద్దాలి. ఇలా రోజుకు ఒక్కసారి, వారానికి మూడు సార్లు చేస్తే పగుళ్లకు చెక్ పెట్టవచ్చు.
అలాగే గోరింటాకు పేస్ట్‌ను పగుళ్లున్న చోట పట్టించి ఆరాక కడిగేస్తే పగుళ్ల నుంచి పాదాలకు ఉపశమనం లభిస్తుంది. ఇంకా కాళ్లు మునిగేంత వేడినీటిలో కాసింత ఉప్పు, నిమ్మరసం వేయాలి. అందులో పాదాలను కాసేపు ఉంచి.. బ్రష్‌తో శుభ్రం చేసుకుంటే.. మీ పాదాలు శుభ్రం కావడంతో పాటు పగుళ్ల దరి చేరవు.
ఇక కలబంద రసం లేదా వాటితో తయారైన జెల్లీలను శీతాకాలంలో పెదవులకు రాస్తే పగుళ్లు ఏర్పడవు. శీతాకాలంలో పెదవులు పొడిబారకుండా ఉండాలంటే నీళ్లు తీసుకుంటూ ఉండాలి. శీతాకాలంలో పోషకాహారం కోసం తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.