Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకర రాశి 2021: బంధుమిత్రులతో మనస్పర్థలు, పెద్దల ఆరోగ్యం విషయంలో...

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (21:49 IST)
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం: 14 వ్యయం: 14 రాజపూజ్యం: 3 అవమానం: 1
ఈ రాశివారికి గురు, కేతువుల సంచారం అధికంగా వుంది. మనోధైర్యంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు పొందుతారు. ధన సమస్యలు కొలిక్కివస్తాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే అవకాశం ఉంది. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. బంధుమిత్రులతో మనస్పర్ధలెదురవుతాయి.
 
పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కకపోవచ్చు. పారిశ్రామిక రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. మార్కెట్ రంగాల వారు అతికష్టంమీద టార్గెట్‌ను పూర్తి చేస్తారు.
 
ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు నిరుత్సాహం అధికం. పాడి, వ్యవసాయ తోటల రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పౌల్ట్రీ, మత్స్య రంగాల వారికి ఆశాజనకం. స్థల వివాదాలు నిదానంగా కొలిక్కి వస్తాయి. విదేశీయాన యత్నం ఫలించకపోవచ్చు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

లేటెస్ట్

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments