Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తులా రాశి 2021: ధన యోగం, కార్యాలు దిగ్విజయం

Advertiesment
తులా రాశి 2021: ధన యోగం, కార్యాలు దిగ్విజయం
, గురువారం, 10 డిశెంబరు 2020 (20:43 IST)
తుల: చిత్ర 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం: 2 వ్యయం: 8 రాజపూజ్యం: 1 అవమానం: 5
ఈ రాశివారికి ధనయోగం, పుత్ర మూలక సౌఖ్యం వున్నాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఏ కార్యం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాల కోసం తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు.
 
నగదు, పత్రాలు జాగ్రత్త. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. అధికారులతో తరచూ సమస్యలెదురవుతుంటాయి. నిరుద్యోగులకు కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశీ చదువులు అనుకూలిస్తాయి.
 
వ్యాపారాల్లో ఒడిదుడుకులు ధీటుగా ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే  రబీ సీజన్ కలిసివస్తుంది. పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య ఆస్తి విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి నెలకొంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీక మాసం చివరి ఐదు రోజులు.. ఇవి తప్పనిసరి..