Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-06-2022 నుంచి 18-06-2022 మీ వార రాశిఫలాలు (video)

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (22:04 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కష్టం ఫలిస్తుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఆది, సోమవారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గృహమార్పు కలిసివస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆరోగ్యం బాగుంటుంది. ఉపాధి పథకాలు చేపడతారు. పెట్టుబడులు కలిసిరావు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. బిల్డర్లు, కార్మికులకు కష్టకాలం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
సంప్రదింపులకు అనుకూలం. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పొదుపు పథకాలపై ఆసక్తి కనబరుస్తారు. (ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగుతాయి. మధ్యవర్తులను విశ్వసించవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మంగళ, బుధవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెళకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు వీడ్కోలు, స్వాగతం పలుకుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఈ వారం ఆశాజనకమే. ప్రతికూలతలు తొలగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. సన్నిహితుల సలహా పాటించండి. గృహనిర్మాణాలకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. కార్మికులకు కష్టకాలం. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తారు. మీ సమర్థతపై ఎదుటివారికి గురికుదురుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురు, శుక్రవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం, సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వాహనచోదకులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
గ్రహాల అనుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరచరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. వివాహయత్నం ఫలిస్తుంది. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. మీ కష్టం వృధాకాదు. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. కొత్త యత్నాలకు సోమ, మంగళవారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగస్తులకు పనిభారం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పోగొట్టుకున్న పత్రాలు అతికష్టంమ్మీద సంపాదిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు, 
లక్ష్య సాధనకు మరింత శ్రమించాలి. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. విమర్శించిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. బుధవారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. మీ ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. అవివాహితులు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. రిటైర్లు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
ప్రతికూలతలను అవకాశాలుగా మలుచుకుంటారు. మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో జరుగుతాయి. మీ సలహా అయిన వారికి కలిసివస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆది, గురువారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి, ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. పదవుల నుంచి తప్పుకోవలసి వస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తారు. ధనలాభం ఉంది. దుబారా ఖర్చులు విపరీతం, పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. శుక్ర, శనివారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కుంటారు. హోల్‌సేల్స్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. చేతివృత్తులు, కార్మికులకు నిరుత్సాహకరం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆర్థికంగా బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఆలోచనలతో సతమతమవుతారు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. మంగళ, బుధవారాల్లో విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి.
మీపై శకునాల ప్రభావం అధికం. ఈ చికాకులు తాత్కాలికమే. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. గృహమార్పు అనివార్యం. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభంతగదు. ఉపాధ్యాయులకు స్థానచలనం ఆందోళన కలిగిస్తుంది. వ్యవసాయ వారికి వాతావరణం అనుకూలిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
అన్ని వర్గాల వారికి అనుకూలమే. లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల్లో ఒత్తిడి అధికం. ఆదివారం నాడు బంధుమిత్రులతో జాగ్రత్త. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పు పట్టవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. గృహమార్పు కలిసివస్తుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాభివృద్ధికి తీవ్రంగా శ్రమిస్తారు. మీ పథకాలు మునుముందు మంచి ఫలితాలిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. చేతివృత్తులు, కార్మికులకు ఆదాయాభివృద్ధి.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సన్నిహితుల ప్రోత్సాహంతో యత్నాలు సాగిస్తారు. ప్రతికూలతలెదురైనా నిరుత్సాహపడవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రాబడిపై దృష్టి పెడతారు. పనుల్లో అవాంతరాలెదురవుతాయి. బుధ, గురువారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు ఉల్లాసం కలిగిస్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

భర్తను రోడ్డు మీదికి ఈడ్చేలా మహిళల ప్రవర్తన ఉండరాదు : సుప్రీంకోర్టు

Snake: గురుకులం పాఠశాలలో పాము కాటు ఘటనలు.. ఖాళీ చేస్తోన్న విద్యార్థులు

పార్లమెంట్‌లో తోపులాట : రాహుల్ గాంధీపై కేసు నమోదు

అన్నీ చూడండి

లేటెస్ట్

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments