Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weekly Horoscope: 05-01-2025 నుంచి 11-01-2025 వరకు ఫలితాలు

రామన్
శనివారం, 4 జనవరి 2025 (20:17 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. స్థిరాస్తి మూలకు ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తరచు ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఉద్యోగపరంగా ఆశించిన ఫలితాలున్నాయి. అధికారులకు బాధ్యతల మార్పు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణసమస్యల నుంచి విముక్తులవుతారు. పలుకబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులు చేపడతారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. లక్ష్యం సాధించే వరకు శ్రమిండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. గృహమరమ్మతులు చేపడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. వృత్తి బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. పందాలు, పోటీల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మిథునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. కుటుంబీకుల కోసం వ్యయం చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. పెద్దల సలహా తీసుకోండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. బుధవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు చేపడతారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు ఆచితూచి అడుగేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు.. ఒక సంఘటను మీపై ప్రభావం చూపుతుంది. నోటీసులు అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా ఆలోచింపవద్దు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. కీలక చర్చల్లో పాల్గొంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి నిదానంగా అనుకూలిస్తుంది. నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా ఫర్వాలదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. ఉల్లాసంగా గడుపుతారు. సోమవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మిన వారే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లోనుకావద్దు. ఉపాధి పథకాలు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పందాలు, పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. శనివారం నాడు ముఖ్యుల సంర్శనం వీలుపడదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఇతరుల తప్పిదాలకు మీరు బాధ్యులవుతారు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు. అధికారులకు హోదామార్పు, వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ప్రయాణంలో కొత్త వారితో జాగ్రత్త.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగుంటుంది. అయిన వారి కోసం విపరీతంగా ఖర్చుచేస్తారు. పొదుపునకు అవకాశం లేదు. తరుచు బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. మీ సమర్థతపై ధైర్యం కలుగుతుంది. ఆటంకాలెదురైనా ముందుకు సాగుతారు. అనుకున్న లక్ష్యం సాధించే వరకు శ్రమించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదివారం నాడు నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్తవారితో మితంగా సంభాషించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. కోల్పోయిన పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సహోద్యోగులతో వేడుకలో పాల్గొంటారు. బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ఓర్పు, పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. మంగళవారం నాడు కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. మీ ఇబ్బందులను ఆప్తులకు తెలియజేయండి. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. సంతానానికి శుభయోగం. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. వస్త్ర, పచారీ వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. కళాత్మక పోటీల్లో స్త్రీలు విజయం సాధిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు నష్టానికి దారితీస్తాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గురువారం నాడు ఆచితూచి అడుగువేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం అనుకూలదాయకం. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. యత్నాలకు పెద్దల ఆశీస్సులుంటాయి. అవకాశాలను అందపుచ్చుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఉత్సాహంతో ముందుకు సాగండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పరిచయస్తులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యక్రమం విజయవంతమవుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు మరింత బలపడతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచికే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి ఆందోళన కలిగించిన సమస్య నిదానంగా సద్దుమణుగుతుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. పందాలు, పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు ఓర్పుతో శ్రమించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ముందుచూపుతో వ్యవహరించండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. శుక్రవారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

Thota Trimurthulu: పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలి.. తోట త్రిమూర్తులు

ఉత్తర భారతదేశాన్ని కప్పేస్తున్న పొగమంచు, కుక్కపిల్లలకు చలిమంట వేస్తున్న యువకుడు (video)

జేసీ ప్రభాకర్ రెడ్డి: తన బస్సులు కాలిన ఘటన తర్వాత జగన్ రెడ్డి మంచోడు అని ఎందుకు అంటున్నారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

02-01-2025 గురువారం దినఫలితాలు : బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు...

01-01-2025 బుధవారం దినఫలితాలు : గృహం సందడిగా ఉంటుంది...

01-01-2025 నుంచి 31-01-2025 వరకు ఫలితాలు మీ మాస ఫలితాలు

31-12-2024 మంగళవారం రాశిఫలాలు : రుణ సమస్యలు తొలగిపోతాయి..

Bird Flies Into Your House? ఇంట్లోకి కాకి, పావురం వస్తే మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments