Webdunia - Bharat's app for daily news and videos

Install App

06-03-2022 నుంచి 12-03-2022 వరకు మీ రాశిఫలాలు

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (22:16 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
మీ వాక్కు ఫలిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆది, మంగళవారాల్లో పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. బుధ, గురువారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఈ వారం ఆశాజనకమే. పరిస్థితులు కొంత మేరకు మెరుగుపడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సందర్భానుసారం నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. ఒక ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. గృహమార్పు నిదానంగా సత్ఫలితమిస్తుంది. నిరుదోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. షాపు పనివారలతో జాగ్రత్త. పుణ్యక్షేత్ర సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
మీ ఓర్పు, నేర్పునకు పరీక్షా సమయం. అవకాశాలను తక్షణం సద్వినియోగం చేసుకోండి. సహాయం, సలహాలు ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. గురు, శుక్రవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక, యోగా విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులు, వృత్తుల వారికి కష్టకాలం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహిచండి. ప్రలోభాలకు లొంగవద్దు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 

సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆది, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఉపాధ్యాయులకు శుభవార్తా శ్రవణం. అధికారులకు హోదామార్పు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మంగళ, బుధవారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. వాస్తుకు అనుగుణంగా మార్పులు చేపడతారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. శుక్ర, శనివారాల్లో పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ధనలాభం ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. బుధ, గురు వారాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ప్రయాణం విరమించుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
వ్యవహారాలు అనుకూలిస్తాయి. గత సమస్యల నుంచి విముక్తులవుతారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థాల్లో మెలకువ వహించండి. పనులు హడావుడిగా సాగుతాయి. శుక్ర, శనివారాల్లో ప్రియతముల కలయిక వీలుపడదు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఏకాగ్రత వహించండి. సంతకాలు, చెల్లింపుల్లో జాగ్రత్త. మీ శ్రీమతి సలహా తీసుకోండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరువ్యాపారులు, కార్మికులకు నిరాశాజనకం. కళ, క్రీడాకారులకు ఆదరణ లభిస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అయిన వారి ప్రోత్సాహం ఉంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆశించిన పదవులు దక్కవు. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. మనోధైర్యంతో వ్యవహరించండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయానికి తీవ్రంగా స్పందించవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఎదుటివారి వ్యాఖ్యలు పట్టుదలను పెంచుతాయి. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొంత మొత్తం పొదుపు చేయగల్గుతారు. మంగళవారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మియులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో వ్యవహరించండి. ప్రతిభకు ఆలస్యంగా గుర్తింంపు లభిస్తుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గురు, శుక్రవారాల్లో ఒత్తిడి, ఆందోళన అధికం. కార్యక్రమాలు ముందుకు సాగవు. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. పత్రాలు సమయానికి కనిపించవు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. పనిభారం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్మోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments