Webdunia - Bharat's app for daily news and videos

Install App

24-04-2022 నుంచి 30-04-2022 వరకు మీ వార రాశిఫలితాలు (video)

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (22:24 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఓర్పుతో మెలగండి. ఖర్చులు అదుపులో ఉండవు. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయానికి కుంగిపోవద్దు. మీ మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష, ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆదివారం నాడు పనులు సాగక విసుగు పుట్టిస్తాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. కీలక పత్రాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కార్మికులు, నిరుత్సాహకరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాల సందర్శనం మనోల్లాసం కలిగిస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
ఆచితూచి అడుగేయాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. తప్పటడుగు వేస్తారు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. పంతాలు, భేషజాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సోమ, మంగళవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఆత్మీయులరాక ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధ్యాయులకు స్థానచలనం. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ధైర్యంగా వ్యవహరిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేకులు చేరువవుతారు. బంధుత్వాలు బలపడతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బుధ, గురువారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. మీ ప్రమేయంతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి అధికం. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
పంతాలకు పోవద్దు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ తప్పును సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలు పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఆది, శుక్రవారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కార్మికులు బిల్డర్లకు కష్టకాలం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మునుముందు చక్కని ఫలితాలిస్తాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము 
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆరోగ్యం జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధి అవకాశాలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. బిల్డర్లు, కార్మికులకు కష్టకాలం. విద్యార్థులకు ఒత్తిడి అధికం. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ఈ వారం ప్రతికూలతలు అధికం. సంప్రదింపులు ముందుకు సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ధనసహాయం అర్థించటానికి మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆత్మీయులతో సంభాషణ మనశ్శాంతినిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు స్థానచలనం. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. స్టార్ మార్కెట్ ఆటుపోట్ల మధ్య సాగుతుంది.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
భేషజాలకు పోవద్దు. లౌక్యంగా వ్యవహరించండి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. సంప్రదింపులు వాయిదా పడతాయి. రావలసిన ధనం అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం. శనివారం నాడు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. గృహమార్పు కలిసివస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు కొత్త బాధ్యతలు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక వ్యాపారాలు కలిసివస్తాయి. వాహన చోదకులకు దూకుడు తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
కార్యం సిద్ధిస్తుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ప్రత్యర్థుల తీరును గమనించి మెలగండి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మంగళ, బుధవారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి. కీలక పత్రాలు అందుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మొండిగా పనులు పూర్తి చేస్తారు. గురు, శుక్రవారాల్లో ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వృత్తుల వారికి నిరాశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. రాజీమార్గంలోనే సమస్యలు పరిష్కారమవుతాయి. ఆది, శనివారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. గృహమార్పు చికాకుపరుస్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. అధికారులకు అదనపు బాధ్యతలు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
 
 


 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
మీ ఒర్పునకు పరీక్షా సమయం. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పనుల్లో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సోమ, బుధవారాల్లో పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆప్తులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. వ్యాపారాలు ఏమంత సంతృప్తినీయవు. కొనుగోలుదార్లతో సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల తీరు ఆందోళన కలిగిస్తుంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. పత్రాల రెన్యువల్లో నిర్లక్ష్యం తగదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments