Webdunia - Bharat's app for daily news and videos

Install App

27-09-2020 నుంచి 03-10-2020 వరకు మీ వార రాశి ఫలాలు-video

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (19:11 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నేడు కాకున్నా రేపు ఫలిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. ప్రణాళిక రూపొందించుకుంటారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. గురు, ఆది వారాల్లో పనుల్లో అవాంతరాలెదురవుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులలతో సమస్యలెదురౌతాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. మీ శ్రమ వృధా కాదు. అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు రూపొందించుకుంటారు. బుధవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పనులు హడావిడిగా సాగుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. గృహ మార్పు కలిసివస్తుంది. శుభ వార్తలు వింటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. కార్మికులు, చేతి వృత్తుల వారికి ఆశాజనకం. దైవ కార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు తీరుతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. మనోధైర్యంతో ముందుకు సాగండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. శ్రమ ఫలించకున్నా యత్నించామన్న తృప్తి ఉంటుంది. పనుల్లో స్వల్ప అవాంతరాలెదురవుతాయి. గురు, శుక్ర వారాల్లో వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. గృహ మార్పు కలిసివస్తుంది. సంతానం కదలికపై దృష్టి సారించండి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పత్రాలుఅందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ప్రణాలళిక రూపొందించుకుంటారు. ధనలా భం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. సకాలంలో చెల్లింపులు జరుగుతాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. శని, ఆది వారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు అందుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. డబ్బుకు ఇబ్బందులుండవు. మీ వాక్కు ఫలిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు వేగవంతమవుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. మంగళ, బుధ వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. గుట్టుగా యత్నాలు సాగించండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రియతములను కలుసుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహ మరమ్మతులు చేపడుతారు. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ద వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వృత్తులవారికి ఆధాయాభివృద్ధి. ప్రయాణం తలపెడతారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం పరిస్థితుల అనుకూలత ఉంది. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. కొత్తకొత్త ఆలోచనలు స్పురిస్తాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు అర్థాంతంగా ముగిస్తారు. మీ శ్రీమతి విషయాల్లో దాపరికం తగదు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఏ విషయాన్ని తెగే వరకు లాగవద్దు. సంయమనంతో వ్యవహరించండి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. విద్యాసంస్థలకు కొత్తసమస్యలు ఎదురవుతాయి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొన్ని సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడుతారు. పనులు వేగవంతమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. గుట్టుగా వ్యవహరించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సలహా పాటించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. అధికారులకు కొత్త బాధ్యతలు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
వ్యవహారానుకూలత ఉండదు. తప్పటడుగు వేస్తారు. ఆలోచనలు చికాకు పరుస్తాయి. తప్పిదాలను సరిదిద్దుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురు, ఆది వారాల్లో అకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఆప్తుల కలయిక ఊరటనిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగాసాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు అందుకుంటారు.నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. లక్ష్యాలను సాధిస్తారు. మీ పట్టుదల స్పూర్తిదాయకమవుతుంది. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. శుక్ర, శని వారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. పనులు హడావుడిగా సాగుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఇరు వర్గాలు మీ సలహాను పాటిస్తాయి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం, చదువులపై శ్రద్ద వహిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతయి. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. అధికారులకు ధన ప్రలోభం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకివ్వద్దు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చర్చలు పురోగతిన సాగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బందులుండవు. పనులు అనుకున్నవిధంగా సాగుతాయి. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం క్షణ్ణంగా తెలుసుకోవాలి. పెద్దల సలహా పాడించండి. దంపతులు అవగాహనకు వస్తారు. సంతానం చదువులపై మరింత శ్రద్ద వహించాలి. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. పత్రాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు శుభయోగం. ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణం తలపెడతారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారి ఖర్చులే ఉంటాయి. మంగళ, బుధ వారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. పాత మిత్రులను కలుసుకుంటారు. నిర్మాణాలు, మరమ్మతులు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వైద్య, సాంకేతిక రంగాలవారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతికూలతలెదురవుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బందులుండవు. పనులు ముగింపు దశలో అస్తవ్యస్తంగా సాగుతాయి. గురు, శుక్ర వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఇంటి విషయాలపై శ్రద్ద అవసరం. గృహ మార్పుచేర్పులకు అనుకూలం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వ్యాపారాలు పందుకుంటాయి. వృత్తులవారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments