Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరు 2022 మాస గోచార ఫలితాలు (video)

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (20:01 IST)
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ మాసం ప్రథమార్థం ఆశాజనకం. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం. పనులు వేగవంతమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. బంధుత్వాలు బలపడతాయి. ద్వితీయార్థంలో అప్రమత్తంగా ఉండాలి. ఊహించని సమస్యలెదురవుతాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. గృహమార్పు అనివార్యం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది, వనసమారాధనల్లో పాల్గొంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ వాక్కు ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. మీ సంకల్పం త్వరలో సిద్ధిస్తుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. పెట్టుబడులు అనుకూలించవు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆత్మీయుల కలయిక ఉత్తేజపరుస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకోవలసి వస్తుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. గృహం ప్రశాంతంగా ఉంటుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు. వాహనదారులకు అత్యుత్సాహం తగదు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం శుభదాయకమే. వ్యవహార జయం, ప్రశాంతత పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఆకస్మికంగా అవకాశాలు కలిసివస్తాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయా లేర్పడతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. భూ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకోగల్గుతారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. దళారుల విషయంలో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తా శ్రవణం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. పందాలు, జూదాల జోలికి పోవద్దు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
గ్రహాల అనుకూలత బాగుంది. లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహమార్పు సత్ఫలితమిస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాలో నిలదొక్కుకుంటారు. అధ్మాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆలోచనల్లో మార్పువస్తుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆశావహదృక్పథంతో వ్యవహరించండి. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదామార్పు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. ఆదాయం ఫర్వాలేదపిస్తుంది. ఖర్చులు మాత్రం అదుపులో ఉండవు. ధన సమస్వలెదురవుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వివాదాలు సద్దుమణులగుతాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో అశ్రద్ధ తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వనసమారాధనలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతవుతారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని లక్ష్యం నెరవేరదు. సన్నిహితల హితవు మీపై సత్ ప్రభావం చూపుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. న్యాయ, సాంకేతిక రంగాల వారికి సామాన్యం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
వ్యవహారానుకూలత ఉంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించవద్దు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం జాగ్రత్త, అతిగా శ్రమించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఉపాధి పథకాలు చేపడతారు. రైతులకు కొత్త సమస్యలెదురవుతాయి. వాహనదారులకు ఏకాగ్రత ప్రధానం. కొత్త ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
అన్ని రంగాల వారికీ శుభదాయకమే. ఆదాయం బాగుంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి, వ్యాపకాలు సృష్టించుకుంటారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యగా మెలగండి. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
సంకల్పసిద్ధికి పట్టుదల ప్రధానం. అవకాశాలను వదులుకోవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండదు. సన్నిహితుల సాయం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు, ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలహీనపడిన అల్పపీడనం... అయినా వర్షాలు కురుస్తాయనంటున్న ఐఎండీ

Mysore Pak: మైసూరు పాక్, గులాబ్‌ జామూన్‌, రసగుల్లా.. బడాబాబుల పేర్లు ఇలా.. శ్వేతా గౌడ ఎవరు?

కుప్పకూలిన ఐఆర్‌టీసీ వెబ్‌సైట్... ఈ-టిక్కెట్ల బుకింగ్‌లో తిప్పలు...

భార్య బాగోగులు చూసుకునేందుకు వీఆర్ఎస్... భర్త ఫేర్‌వెల్ పార్టీలో ప్రాణాలు విడిచిన భార్య (Video)

నడి రోడ్డుపై తగలబడిన లంబోర్గిని కారు... (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

22-12-2024 ఆదివారం దినఫలితాలు - రుణ సమస్యలు తొలగిపోతాయి..

Weekly Horoscope: 22-12-2024 నుంచి 28-12-2024 వరకు ఫలితాలు- మీ మాటలు చేరవేసే వ్యక్తులు?

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తర్వాతి కథనం
Show comments