Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

01-10-2022 నుంచి 31-10-2022 వరకు మీ మాస రాశిఫలాలు (video)

Astrology
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (17:56 IST)
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. ఆర్థికంగా బాగున్నా వెలితిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. అనుకూలతలు అంతంత మాత్రమే. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కార్యానుకూలతకు మరింత శ్రమించాలి. ఓర్పుతో వ్యవహరించండి. త్వరలో శుభవార్త వింటారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మధ్యవర్తులు, కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన పెట్టుబడులు కలిసిరావు. వృత్తుల వారికి నిరాశాజనకం. దైవదర్శనాల్లో ఒకింత అవస్థలు తప్పవు. 
 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
 
మీదైన రంగంలో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులకు తగిన సమయం. ఆరోగ్యం జాగ్రత్త. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఉభయవర్గాలకూ ఆమోదయోగ్యమవుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేసే అవకాశం లేదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఆధ్యాతిక విషయాలపై దృష్టి పెడతారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. మీ మాటకు ఎదురుండదు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంతానం విదేశీ విద్యా యత్నం ఫలించదు. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఈ మాసం అన్ని విధాలా యోగదాయకం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఆరోగ్యం సంతృప్తికరం. పిల్లల విదేశీ చదువులపై దృష్టి పెడతారు. దళారులను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
 
 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఆర్థికలావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. 
 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
అనుకూలతలు అంతంత మాత్రమే. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. మనోధైర్యంతో మెలగండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అనవసర ఖర్చులు విపరీతం. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పెద్దల సలహా పాటిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
ప్రతికూలతలతో సతమతమవుతారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. ఎవరినీ కించపరచవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. అనవసర జోక్యం తగదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో వ్యవహరించండి. త్వరలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. న్యాయ, సేవా, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులను సంతోషపరుస్తుంది. 
 
ధనురాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం అనుకూలదాయకమే. అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పదవుల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆధ్మాత్మిక చింతన పెరుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. పనులు చురుకుగా సాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మెలకువ వహించండి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. శంకుస్తాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. భవన నిర్మాణ కార్మికులకు పనులు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమించినా ఫలితం ఉండదు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. ప్రతి చిన్న విషయానికి అసహనం చెందుతారు. ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఎదుటివారు మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. పదవుల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఈ మాసం ప్రథమార్ధం అనుకూలదాయకం. కార్యసిద్ధి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. అవసరాలకు ధనం అందుతుంది. ఇంటి సమస్యలపై శ్రద్ధ వహిస్తారు. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా మంచికేనని భావించండి. శకునాలు పట్టించుకోవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు తప్పవు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరాత్రుల్లో పంచమి తిథి.. లలితా సుందరీ దేవిని పూజిస్తే?