Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-04-2023 నుంచి 30-04-2023 వరకు మీ మాస ఫలితాలు

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (20:05 IST)
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్థికస్థితి నిరాశాజనకం. సంప్రదింపులు ఫలించవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణ ఒత్తిళ్లతో సతమతమవుతారు. ఆత్మీయుల సాయం అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. ఆశావహ దృక్పథంతో మెలగాలి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివవ్వద్దు. దంపతుల మధ్య చీటికిమాటికి అకారణ కలహం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. దైవకార్యాలు మనశ్శాంతి కలిగిస్తాయి. 
 
వృషభ రాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆరోగ్యభంగం, ఆదాయానికి మించిన ఖర్చులు. రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. విషయం చిన్నదే అయినా ఆందోళన అధికం. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. మనోధైర్యంతో మెలగండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఇంటి విషయాలపై దృష్టి పెట్టండి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. నూతన వ్యాపారాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు బాధ్యతల మార్పు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఆప్తులకు వీడ్కోలు పలుకుతారు. విదేశీయాన యత్నం ఫలించదు. 
 
మిథున రాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గౌరవమర్యాదలు పెంపొందుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పనులు సానుకూలమవుతాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అవివాహితులకు శుభసూచకం. నిర్మాణాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. దూరప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మానసికంగా కుదుటపడతారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. శుభకార్యానికి యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికస్థితి ఆశాజనకం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు సంతృప్తికరం. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేయగల్గుతారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. గృహ మరమ్మతులు, నిర్మాణాలు చేపడతారు. పదవుల నుంచి తప్పుకోవలసి వస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం. వేడుకలు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మనోధైర్యంతో వ్యవహరించండి. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. దుబారా ఖర్చులు విపరీతం. రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. ఆపత్సమయంలో ఆత్మీయులు ఆదుకుంటారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహ పరుస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బంధుత్వాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాల్లో మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వృత్తుల వారికి ఆశాజనకం. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వాహనదారులకు అత్యుత్సాహం తగదు. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం ఏమంత యోగదాయకం. ఆచితూచి వ్యవహరించాలి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. గృహమార్పు అనివార్యం. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు. 
 
వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. పెట్టుబడులు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. పురస్కారాలు అందుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహార అనుకూలత ఉంది. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పెట్టుబడులకు తరుణం కాదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. దాంపత్య సౌఖ్యం పొందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. కీలకపత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. వేడుకకు హాజరవుతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్ని రంగాల వారికీ అనుకూలమే. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచిదే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆధ్మాత్మిక చింతన పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. అపరిచితులు తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యవహారానుకూలత ఉంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాస్తుదోష నివారణ అనివార్యం. పత్రాలు అందుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. విదేశీయానానికి యత్నాలు సాగిస్తారు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. ధనం మితంగా వ్యయం చేయాలి. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. ఆరోగ్యం సంతృప్తికరం. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు ఉల్లాసం కలిగిస్తాయి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. శుభకార్యంలో పాల్గొంటారు. బంధుమిత్రుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

ప్రతిదీ అసాధ్యం అని చెప్పే వారిని నమ్మవద్దు: స్వామి వివేకానంద

January horoscope 2025 in Telugu: జనవరిలో ఏ రాశుల వారికి అనుకూలమో తెలుసా?

2025 వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు.. ఆదాయం 2, వ్యయం 14

తర్వాతి కథనం
Show comments