జాతకం

మేషం

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆత్మీయులకు కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

రాశిచక్ర అంచనాలు
వృషభం

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ప్రముఖులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. మిత్రుల నుంచి పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త.

రాశిచక్ర అంచనాలు
మిథునం

మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల సందర్శనం నిరీక్షించక తప్పదు. పనులు సానుకూలమవుతాయి. బెట్టింగ్లకు పాల్పడవద్దు.

రాశిచక్ర అంచనాలు
కర్కాటకం

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణుగుతుంది. సన్నిహితులకు కానుకలందిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.

రాశిచక్ర అంచనాలు
సింహం

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ముఖ్యులకు శుభాకాంక్షలు తెలివయజేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.

రాశిచక్ర అంచనాలు
కన్య

కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. కొత్తయత్నాలు చేపడతారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూరిచేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఆత్మీయులకు కానుకలందిస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.

రాశిచక్ర అంచనాలు
తుల

తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు అనుకూలతలు నెలకొంటాయి. లక్ష్యం సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. బెట్టింగ్లకు పాల్పడవద్దు.

రాశిచక్ర అంచనాలు
వృశ్చికం

వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు లావాదేవీలు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతం. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆప్తులకు శుభాకాంక్షలు, కానుకలు అందిస్తారు. దైవదర్శనంలో అవస్థలు తప్పవు. పోటీలు ఉల్లాసాన్నిస్తాయి.

రాశిచక్ర అంచనాలు
ధనస్సు

ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు విపరీతం. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. కార్యక్రమాలు చురుకుగా సాగుతాయి. ప్రముఖులకు కానుకలు అందిస్తారు. ద్విచక్రవాహనదారులకు దూకుడు తగదు.

రాశిచక్ర అంచనాలు
మకరం

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆపన్నులకు సాయం అందిస్తారు. దైవకార్యంలో పాల్గొంటారు.

రాశిచక్ర అంచనాలు
కుంభం

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహారాల్లో తగిన నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఆత్మీయలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

రాశిచక్ర అంచనాలు
మీనం

మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ధనం మితంగా ఖర్చుచేయండి. ఆర్భాటాలు, భేషజాలకు పోవద్దు. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ప్రముఖుల సందర్శనం కోసం నిరీక్షణ తప్పదు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.

రాశిచక్ర అంచనాలు
Show comments