Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-03-2022 మంగళవారం రాశిఫలాలు - లక్ష్యసాధనలో ఊహించని ఆటంకాలు

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (04:02 IST)
మేషం :- మీ లక్ష్య సాధనలో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉండదు. అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. విద్యార్థులకు అతి ఉత్సాహం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి.
 
వృషభం :- రాజకీయనాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్థినుల్లో మానసిక ధైర్యం నెలకొంటుంది.
 
మిథునం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కర్కాటకం :- రాజకీయాలలోని వారికి ప్రయాణాలలో మెళుకువ అవసరం. మీ స్తోమతకు మించి వాగ్దానాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీల ఆరోగ్యములో మెళుకువ అవసరం. సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. తెలివి తేటలతో వ్యవహారించడంవల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.
 
సింహం :- కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త వహించండి. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. దంపతుల మధ్య అరమరికలు లేకుండా మెలగవలసి ఉంటుంది. మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కన్య :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకున్నా నెమ్మదిగా సమసిపోతాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా ఉంటాయి. 
 
తుల :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతాయి.
 
వృశ్చికం :- మీ సంతానానికి కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్త్రీలకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధన వ్యయం అధికమైనా సార్థకత ఉంటుంది. ఉద్యోగస్తుల తొందరపాటు తనం వల్ల అధికారులతో మాటపడక తప్పదు.
 
ధనస్సు :- రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హజరుకావడం మంచిది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం.
 
మకరం :- బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. రుణ దాతలను మంచి మాటలతో సంతృప్తి పరచడం శ్రేయస్కరం. బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. 
 
కుంభం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కీలకమైన విషయాలు మీరే సమీక్షించుకోవటం మంచిది. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.
 
మీనం :- ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటేటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలత్తుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. బంధువులను కలుసుకుంటారు నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

Namma Yatri Auto Issue: నమ్మ యాత్రి ఆటో ఇష్యూ.. నా భార్య ఆటో నుంచి దూకేసింది.. భర్త ఆవేదన

అన్నీ చూడండి

లేటెస్ట్

31-12-2024 మంగళవారం రాశిఫలాలు : రుణ సమస్యలు తొలగిపోతాయి..

Bird Flies Into Your House? ఇంట్లోకి కాకి, పావురం వస్తే మంచిదేనా?

30-12-2024 సోమవారం దినఫలితాలు : పిల్లల దూకుడు అదుపు చేయండి...

డిసెంబరు 29 నుంచి జనవరి 04 వరకు మీ వార ఫలితాలు

Somvati Amavasya 2024 సోమాతి అమావాస్య.. చెట్లను నాటండి.. ఈశాన్య దిక్కులో నేతి దీపం..

తర్వాతి కథనం
Show comments