Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20-03-2022 ఆదివారం రాశిఫలాలు - సూర్యస్తుతి ఆరాధించిన శుభం...

Advertiesment
20-03-2022 ఆదివారం రాశిఫలాలు - సూర్యస్తుతి ఆరాధించిన శుభం...
, ఆదివారం, 20 మార్చి 2022 (04:00 IST)
మేషం :- పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ చాలా అవసరం. మీ ఇష్టాయిష్టాలను కుటుంబీకులకు లౌక్యంగా వ్యక్తం చేయాలి. రచయితలకు, పత్రిక,మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. ప్రముఖుల కలయిక సాధ్యపడుతుంది.
 
వృషభం :- గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి, శారీరకపటుత్వం నెలకొంటాయి. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
మిథునం :- వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇబ్బంది కలిగిస్తుంది. ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పతాయి.
 
కర్కాటకం :- ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. బంధువులకు కిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. స్త్రీల ఉద్యోగయత్నం ఫలిస్తుంది. కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పెద్దలతో ఏకీభవించ లేకపోతారు. నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలసిరాగలదు.
 
సింహం :- వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. శారీరకశ్రమ వల్ల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. మిత్రులకు, చిన్నారులకు విలువైన కానుకలు చదివించుకుంటారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ప్రధానం.
 
కన్య :- వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. రావలసిన ధనం చేతి కందుతుంది. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధిమవుతున్నారు అని గమనించండి. దస్త్రం విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తప్పవు. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు భిన్నంగా ఉంటాయి.
 
తుల :- కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తి అమ్మకానికై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం :- విదేశీయానం కోసం చేసే యత్నాలకు మార్గం సులభమవుతుంది. గత విషయాలు జప్తికి రాగలవు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ప్రధానం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
ధనస్సు :- వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపార ఒప్పందాలు, బకాయిల చెల్లింపులకు అనుకూలం. ఊహించని ఖర్చులు, పెరిగిన అవసరాల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. పెద్దల ఆర్యోగం గురించి మెళుకవ అవసరం. కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి, కార్మికుల నుంచి సమస్యలను ఎదుర్కొంటారు.
 
మకరం :- ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధువుల రాక వల్ల మీ పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కుంభం :- కానివేళలో మిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాటపడక తప్పదు.
 
మీనం :- వ్యాపారంలో కొంతమంది తప్పుదారి పట్టించవచ్చు జాగ్రత్త వహిచండి. రవాణా రంగాలవారికి ప్రయాణీకులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ, సేవా, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రులను నమ్మటం వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19-03-2022 శనివారం రాశిఫలాలు - అభయ ఆంజనేయస్వామిని...