Webdunia - Bharat's app for daily news and videos

Install App

21-03-2022 సోమవారం రాశిఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ ...

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (04:00 IST)
మేషం :- మీ లక్ష్య సాధనలో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉండదు. అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. విద్యార్థులకు అతి ఉత్సాహం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి.
 
వృషభం :- రాజకీయనాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్థుల్లో మానసిక ధైర్యం నెలకొంటుంది.
 
మిథునం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కర్కాటకం :- రాజకీయాలలోని వారికి ప్రయాణాలలో మెళుకువ అవసరం. మీ స్థోమతకు మించి వాగ్ధానాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీల ఆరోగ్యములో మెళుకువ అవసరం. సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. తెలివి తేటలతో వ్యవహారించడంవల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.
 
సింహం :- కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త వహించండి. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. దంపతుల మధ్య అరమరికలు లేకుండా మెలగవలసి ఉంటుంది. మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కన్య :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకున్నా నెమ్మదిగా సమసిపోతాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా ఉంటాయి. 
 
తుల :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతాయి.
 
వృశ్చికం :- మీ సంతానానికి కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్త్రీలకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధన వ్యయం అధికమైనా సార్థకత ఉంటుంది. ఉద్యోగస్తుల తొందరపాటు తనం వల్ల అధికారులతో మాటపడక తప్పదు.
 
ధనస్సు :- రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హజరుకావడం మంచిది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం.
 
మకరం :- బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. రుణ దాతలను మంచి మాటలతో సంతృప్తి పరచడం శ్రేయస్కరం. బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
కుంభం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కీలకమైన విషయాలు మీరే సమీక్షించుకోవటం మంచిది. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.
 
మీనం :- ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటేటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలత్తుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. బంధువులను కలుసుకుంటారు నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

బియ్యం గోడౌన్‌లో గంజాయి బ్యాగ్ పెట్టేందుకు ప్రయత్నించారు, పోలీసులపై పేర్ని నాని ఆరోపణ

భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ భారీ విరాళం రూ.1.11 కోట్లు

25-12-2024 బుధవారం దినఫలితాలు : అనుకున్న లక్ష్యం సాధిస్తారు...

TTD vaikunta ekadashi 2025 : ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం

24-12-2024 మంగళవారం దినఫలితాలు : ఆప్తుల సలహా పాటిస్తారు...

23-12-2024 సోమవారం దినఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త

తర్వాతి కథనం
Show comments