Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-04-22 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా...

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (04:00 IST)
మేషం :- రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. సాముహిక దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు అధికారులకు విలువైన బహుమతులు అందించి ప్రసన్న చేసుకుంటారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు.
 
వృషభం :- వైద్య అవసరాలకు నిధులు సర్దుబాటవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. రాజకీయ నాయకులకు సమావేశాలు, బృందకార్యక్రమాలకు అనుకూలం. వృత్తి వ్యాపారులకు శ్రమాధిక్యత మినహా ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- ఎంతో కాలంగా వేధిస్తున్నా సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయినవారి కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు ప్రోత్సాహం. గృహంలో మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, కార్మికులతో చికాకులు తప్పవు.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాల్లో స్నేహపరిచయాలు ఏర్పడతాయి. గృహంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. బంధువులను 
కలుసుకుంటారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. బోధన, ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి అనుకూలం.
 
సింహం :- విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. వాయిదా పడిన పనులు అనుకోకుండా పూర్తిచేస్తారు. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉన్నత పదవులు అందుకుంటారు.
 
కన్య :- కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. చిన్నతరహా పరిశ్రమలకు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
తుల :- మీకు నచ్చిన విషయాలపై దృష్టి పెడతారు. బంధువుల తోడ్పాటుతో ఒక అడుగు ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలను తీర్చి ఊపిరి పీల్చుకుంటారు. వాహనయోగం వంటి శుభ ఫలితాలు పొందుతారు. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- బంధువుల తోడ్పాటుతో ఒక అడుగు ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. అర్ధంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఇతరులు మీ పట్ల ఆకర్షితులౌవుతారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు :- దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. రుణాలు తీరుస్తారు. గృహం ఏర్పరుచుకోవాలనే కోరిక బలపడుతుంది. బంధువుల మధ్య సంభంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయం కాగలవు.
 
మకరం :- ఆర్ధికంగా మంచి అభివృద్ధిని పొందుతారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. స్త్రీలకు నాణ్యత ధరల పట్ల ఏకాగ్రత ముఖ్యం. వ్యాపారాభివృద్ధికి పలు పథకాలు అమలు చేస్తారు. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల ఇబ్బందు లెదుర్కోవలసి వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
 
కుంభం :- వ్యాపారాభివృద్ధికి మీరు వేసే ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలనిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. మీ ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా మెలగండి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి.
 
మీనం :- విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు తలకిందులవుతాయి. ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత మిత్రుల కలయికతో మనశ్సాంతిని పొందుతారు. స్త్రీలకు ఇరుగు, పొరుగువారి నుంచి విమర్శలు తప్పవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

Namma Yatri Auto Issue: నమ్మ యాత్రి ఆటో ఇష్యూ.. నా భార్య ఆటో నుంచి దూకేసింది.. భర్త ఆవేదన

అన్నీ చూడండి

లేటెస్ట్

31-12-2024 మంగళవారం రాశిఫలాలు : రుణ సమస్యలు తొలగిపోతాయి..

Bird Flies Into Your House? ఇంట్లోకి కాకి, పావురం వస్తే మంచిదేనా?

30-12-2024 సోమవారం దినఫలితాలు : పిల్లల దూకుడు అదుపు చేయండి...

డిసెంబరు 29 నుంచి జనవరి 04 వరకు మీ వార ఫలితాలు

Somvati Amavasya 2024 సోమాతి అమావాస్య.. చెట్లను నాటండి.. ఈశాన్య దిక్కులో నేతి దీపం..

తర్వాతి కథనం
Show comments