Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-04-22 మంగళవారం రాశిఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు...

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (04:00 IST)
మేషం :- పండ్ల, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు పై అధికారులతో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
వృషభం :- రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి యోగదాయకం. యాదృచ్చికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. బంధువులను కలుసుకుంటారు.
 
మిథునం :- సొంతంగా గాని, భాగస్వామ్యంగాగాని మీరు ఆశించిన విధంగా రాణించగలరు. వాహనం నడుపునపుడు మెలకువ అవసరం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చెడును అతిగా ఊహించవద్దు. మీ ఆశ నెరవేర్చుకోవడానికి ఇదే సమయం. ప్రత్తర్షులు సైతం వీరి ఔనత్యాన్ని గుర్తిస్తారు.
 
కర్కాటకం :- లీజు, ఏజెన్సీలు. నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. సన్నిహితులతో కలసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. గృహ మరమ్మతులు అనుకూలిస్తాయి. స్త్రీలు షాపింగులో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
 
సింహం :- ఆర్థికంగా పురోగమిస్తారు. రాజకీయ నాయకులు అధికంగా ఆలోచించడం వల్ల ఆందోళనలకు గురౌతారు. మిత్రులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఇతరుల కారణాల వలన మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి.
 
కన్య :- ఆర్థిక లావాదేవీలు, స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. రావలసిన ధనం చేతికందటంతో ఖర్చులు అధికమవుతాయి. గృహంలో మార్పులకై యత్నాలు అనుకూలిస్తాయి. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త వహించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.
 
తుల :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోదరీ, సోదరులతో అవగాహన కుదరదు. ఆలయాలను సందర్శిస్తారు. ఫైనాన్సు, చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నిరుత్సాహం కానవస్తుంది. కుటుంబీకుల అభివృద్ధి కోసం పథకాలు వేస్తారు. అందరితో కలసి విందు, వినోదాలలోపాల్గొంటారు.
 
వృశ్చికం :- కాంట్రాక్టర్లు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణ ముఖ్యం. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చడం వల్ల మాటపడవలసి వస్తుంది. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. బృంద కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
ధనస్సు :- సొంత వ్యాపారాలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. రాజకీయ, పారిశ్రామికరంగాల వారికి చివరిలో విదేశీ పర్యటనలు ఉంటాయి. మధ్యవర్తిత్వం వహించుట వలన సమస్యలను ఎదుర్కుంటారు.
 
మకరం :- గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. అయిన వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వృత్తులలోని వారికి భాద్యతలు పెరుగును. ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్పెక్యులేషన్ రంగాల వారికి అభివృద్ధి పొందుతారు.
 
కుంభం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారస్తులకు అన్ని విధాలా కలిసివస్తుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి. జాగ్రత్త వహించండి.
 
మీనం :- ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, శ్రను అధికం. పెద్దల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. బదిలీలు మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

లేటెస్ట్

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments