Webdunia - Bharat's app for daily news and videos

Install App

15-10-2021 శుక్రవారం దినఫలాలు .. రాజరాజేశ్వరి దేవిని ఆరాధించినా..

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (04:00 IST)
మేషం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండగలవు. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. దుబారా ఖర్చులు అధికం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
వృషభం :- రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల మెళుకువ అవసరం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. ధైర్యంతో ముందడుగు వేస్తే తప్ప అది ఆనందదాయకం కాదు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.
 
మిథునం :- రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు ఆందోళన అధికమవుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికం. సాహస ప్రయత్నాలు విరమించండి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు.
 
కర్కాటకం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అయినవారిని అనుమానించడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఒకరికి సహాయంచేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు.
 
సింహం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. విందులలో పరిమితి పాటించండి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
కన్య :- బంధు మిత్రుల మధ్య ప్రేమానుబంధాలు, ఆత్మీయత మరింత బలపడతాయి. వ్యాపారరంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.
 
తుల :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మిత్రులను కలుసుకుంటారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ వాహనం, విలువైన వస్తువులు ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి.
 
వృశ్చికం :- మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ప్రతికూలత లెదురవుతాయి. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
ధనస్సు :- ఆర్థిక విషయాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టం మీద పూర్తి చేస్తారు. కొంత మంది మీ నుంచి కీలకమైన విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు.
 
మకరం :- సతీసమేతంగా ఒక పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలలో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. తీర్ధయాత్రలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. సేవా, సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో భేషజం, మొహమ్మాటాలు కూడదు. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
కుంభం :- విందులలో పరిమితి పాటించండి ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వ్యవసాయదారులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానవచ్చును. దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మీనం :- వేడుకలలో పాల్గొంటారు. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేయవలసి ఉంటుంది. ఆపత్సమయంలో బంధుమిత్రులకు అండగా నిలబడతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

తర్వాతి కథనం
Show comments