Webdunia - Bharat's app for daily news and videos

Install App

30-01-2024 మంగళవారం దినఫలాలు - కుబేరుడిని ఆరాధించిన ఆర్థికాభివృద్ధి...

రామన్
మంగళవారం, 30 జనవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య బ॥ పంచమి పూర్తి ఉత్తర రా.7.47 తె.వ.5.01 ల
ఉ. దు. 8.46 ల 9.30 రా.దు. 10.45 ల 11.37 
కుబేరుడిని ఆరాధించిన ఆర్ధికాభివృద్ధి పురోభివృద్ధి పొందుతారు.
 
మేషం :- సంఘంలో మీకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అసవరం. ప్రముఖులను కలుసుకుని బహుమతులు అందజేస్తారు. ప్రముఖులకు శుభాకాంక్షలు అందజేస్తారు. బంధు మిత్రులను విందులకు ఆహ్వానిస్తారు. మీ ఉన్నతి చాటు కోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. 
 
వృషభం :- మీ విరోధులు వేసే పథకాలు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. రాజకీయనాయకులు సభా, సమావేశాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి విందులు, వేడుకలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
మిథునం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారాల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. క్రీడ, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. సంఘంలోమంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. తలపెట్టిన పనులు సానుకూలమవుతాయి. గృహంలో ఏదైనా శుభకార్యంనిమిత్తం చేసే కృషి ఫలిస్తుంది.
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు, కీలకమైన వ్యవహారాలు సమర్థంగా పరిష్కరిస్తారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల ఇబ్బందులు తప్పవు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్సులు, క్లయింటు మంజూరవుతాయి.
 
సింహం :- ప్రముఖులను కలుసుకుంటారు. భాగస్వామిక చర్చలు సంప్రదింపులు ప్రశాంతంగా ముగుస్తాయి. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచటం మంచిది. తలపెట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది.
 
కన్య :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ ప్రత్యర్థుల ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కుంటారు. బంధువులను కలుసుకుంటారు. దంపతుల మధ్యఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
తుల :- ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ యత్నాలకు కుటుంబ సభ్యులు సహకరించక పోవటంతో నిరుత్సాహం చెందుతారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు.
 
వృశ్చికం :- ఎడతెగని ఆలోచనలు, అవిశ్రాంతకృషి ఫలితంగా ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొన్ని పనులు సాధిస్తారు. కార్యసాధనలో చిన్న చిన్న ఆటంకా లెదురైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
ధనస్సు :- వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. బేకరీ రంగాల వారికి లాభదాయకం. విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది.
 
మకరం :- భార్యా, భర్తల మధ్య బంధం మరింతగా దృఢంగా మారుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యల నిమిత్తం చేసే కృషిలో రాణిస్తారు. ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. మీ సంతానం కదలికలను గమనించటం ఎంతైనా అవసరం.
 
కుంభం :- వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. బంధు మిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనాదాయం బాగున్నా గృహంలో శుభకార్యల వల్ల ఖర్చులు అధికమవుతాయి. నూతన వ్యక్తుల కలయిక సంభవించును.
 
మీనం :- మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సోదరీ సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు తోటి విద్యార్ధులతో విందులు, వేడుకలలో పాల్గొంటారు. పంతాలకు పోకుండా బంధువులతో ఆదరంగా మెలగండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

లేటెస్ట్

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న శ్రీశైలం

29-12-2024 ఆదివారం దినఫలితాలు -రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి...

శనివారం ప్రదోషం: సాయంత్రం పాలు, పెరుగు అభిషేకానికి సమర్పిస్తే?

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

28-12-2024 శనివారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments