Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-01-2024 గురువారం దినఫలాలు - లక్ష్మీకుబేరుడిని ఆరాధించిన సంకల్పసిద్ధి...

Advertiesment
astro12

రామన్

, గురువారం, 25 జనవరి 2024 (09:01 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు॥ పూర్ణిమ రా.10.37 పునర్వసు ఉ.8.07 సా.వ.4.43 ల 6.26.
ఉ. దు. 10.15 ల 10.59 ప.దు. 2.39 ల 3.23.
లక్ష్మీకుబేరుడిని ఆరాధించిన సంకల్పసిద్ధి, మనోసిద్ధి పొందుతారు.
 
మేషం :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన మంచి ఫలితాలు సాధించగల్గుతారు. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదుర్కుంటారు.
 
వృషభం :- స్వర్ణకారులకు, నగల వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. దూర ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనలకు పథకాలు రూపొందిస్తారు. నూతన పరిచయాలేర్పడతాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఏ వ్యక్తినీతక్కువగా అంచనా వేయటం మంచిది కాదు.
 
మిథునం :- ప్రముఖుల కోసం నిరీక్షించవలసి వస్తుంది. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి కానవస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు, నూతన వ్యాపారాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆధ్మాత్మిక, సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలందిస్తారు.
 
కర్కాటకం :- విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాదు. మీ యత్నాలు, అభిప్రాయాలకు కుటుంబీకుల ప్రోత్సాహం లభిస్తుంది.
 
సింహం :- ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులు రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారల ఆదాయం బాగుంటుంది. మీ శ్రీవారి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ధనసహాయం, హామీలు ఉండే విషయంలో దూరంగా ఉండటం మంచిది.
 
కన్య :- ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. పాతమిత్రుల కలయికతో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత అవసరం. కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రుల కలయిక, నూతన వస్తువులు కొనుగోలు, వస్త్రలాభములు, వ్యవహార జయము కలుగును.
 
తుల :- అధిక ధన వ్యయం చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. షాపింగులోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. వృత్తి, ఉద్యోగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం. శతృవులపై విజయం సాధిస్తారు.
 
వృశ్చికం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులకు అధిక శ్రమ వల్ల ఆరోగ్యంలో చికాకులు తప్పవు.
 
ధనస్సు :- కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ రంగాల్లో రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. క్రీడ, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో జయం పొందుతారు. విద్యార్థులలో అవగాహన లోపం వల్ల ఆందోళన ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి.
 
మకరం :- ఉద్యోగస్తులు గౌరవ ప్రతిష్ఠలు పెరుగును. ఆదాయానికి మించిన ఖర్చుల వల్ల ఇబ్బందులు తప్పవు. ప్రతి వ్యవహారంలో చొరవగా ముందుకు దూసుకుపోతారు. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. హోటల్, కేటరింగ్, తినుబండారాల వారికి లాభదాయకంగా ఉంటుంది.
 
కుంభం :- భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. గత అనుభవంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. వ్యవసాయదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది.
 
మీనం :- ఆర్థిక రహస్యాలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. ఒక సమస్య పరిష్కారం కావటంతో మీలో మనోధైర్యం నెలకొంటుంది. ఖర్చులు అధికం, ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్యలో బాల రాముడికి ప్రాణప్రతిష్ట చేశారు.. సీతారాములకి ఎందుకు చేయలేదు?