Webdunia - Bharat's app for daily news and videos

Install App

27-06-2023 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధిస్తే శుభం..

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (04:04 IST)
మేషం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఉద్యోగస్తులు అధికారులను తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం :- మిత్రులతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలు మోకాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. ఎంత కష్టమైనపనైనా అవలీలగా పూర్తి చేస్తారు. సోదరీ, సోదరుల కలయిక, పరస్పర అవగాహన కుదరదు. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోవచ్చు. 
 
మిథునం :- రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. విద్యార్ధినులకు టెక్నికల్, సైన్సు కోర్సులలో అవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం :- స్త్రీలకు తల, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.
 
సింహం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికులు తప్పవు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు, అశ్రద్ధకూడదు.
 
కన్య :- చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. ఊహించని విజయం మిమ్మల్ని విజయంతో ముంచెత్తుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. కొబ్బరి, పండ్ల, పూలవ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు.
 
తుల :- దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. బంధు మిత్రులతో ప్రయాణాలు సాగిస్తారు. స్త్రీల తొందరపాటుతనం వల్ల బంధువర్గాల నుండి మాటపడవలసి వస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు.
 
వృశ్చికం :- ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ధనవ్యయం, శ్రమాధిక్యతతో వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- ఆదాయానికి తగినట్లుగా వ్యయం చేస్తారు. బంధు మిత్రుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయ వంతంగా పూర్తి చేస్తారు. ప్రతి చిన్న చిన్న విషయాలకు ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు.
 
మకరం :- ధనాన్ని మంచి నీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తారు. ఉన్నట్టుంది వేదాంత ధోరణి కానవస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులు సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిని అమ్మటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. సభలు, సమావేశాలు, వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సమర్థత పై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది.
 
మీనం :- మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతిసలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిదికాదని గమనించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు.. పులివెందులతో సీన్ మారుతోందిగా!

నా మరదలంటే నాకు పిచ్చి ప్రేమ, పెళ్లి చేయకపోతే టవర్ పైనుంచి దూకి చస్తా: బావ డిమాండ్, ఏమైంది? (video)

అమెరికా విర్రవీగుతోంది.. భారత్‌తో పెట్టుకోవడమంటే ఎలుక వెళ్లి ఏనుగును గుద్దినట్టుగా ఉంటుంది..

Lakh Bribe: లంచం తీసుకున్న ఎస్ఐకి ఏడేళ్ల జైలు శిక్ష.. ఎక్కడ?

హంద్రీనీవా సుజల స్రవంతి నీటితో చంద్రబాబు చిత్ర పటం.. నెట్టింట వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: వినాయక చతుర్థి రోజున మరిచిపోయి కూడా ఈ విషయాలు చేయకండి.

Ganesh Chaturthi 2025: గణేశ చతుర్థి రోజున విరిగిన విగ్రహాన్ని ఇంటికి తేవడం..?

25-08-2025 సోమవారం ఫలితాలు - ఒప్పందాల్లో జాగ్రత్త.. ఏకపక్ష నిర్ణయాలు తగవు...

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments