Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-06-2023 సోమవారం రాశిఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన శుభం..

Advertiesment
Pisces
, సోమవారం, 26 జూన్ 2023 (04:00 IST)
మేషం :- పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. అప్పుడప్పుడు పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. బృందా కార్యక్రమాలల్లో పాల్గొంటారు. మొండిబాకీల వసూలు కొంత మేరకు వసూలుకాగలవు.
 
వృషభం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ అభిరుచికి తగినవ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
మిథునం :- దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా పాటించటం మంచిది. కుటుంబ విషయాలు, శ్రీమతి వైఖరి చికాకు పరుస్తాయి. బ్యాంకు వ్యహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. చిన్నచిన్న విషయాలలో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది.
 
సింహం :- దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. బంధువుల రాకతో పనులు అసంపూర్తిగా ముగించవలసివస్తుంది. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. సోదరీ సోదరుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి.
 
కన్య :- విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమంకాదు.
 
తుల :- ఆర్థిక, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. మీ విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచనమంచిది.
 
వృశ్చికం :- ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కళ్ళు, నడుము నరాలకు సంబంధించి చికాకులను ఎదుర్కుంటారు. నూతన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ, ఏకాగ్రత అవసరం.
 
ధనస్సు :- కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ విషయాలు, శ్రీమతి వైఖరి చికాకు పరుస్తాయి.
 
మకరం :- భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలమే. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ఆరోగ్య రీత్యా స్వల్ప ఇబ్బందులు ఎదుర్కుంటారు.
 
కుంభం :- గృహ మరమ్మతులు, మార్పులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ఖర్చుల వల్ల ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో పెద్దల సలహా పాటిస్తారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యుకు ఏకాగ్రత ముఖ్యం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు.
 
మీనం :- కుటుంబీకులు మీ ఇబ్బందులను అర్థం చేసుకుంటారు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. కొంతమంది మీట మాటలు ఇతరులకు చేరవేసే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25-06-2023 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం..