Webdunia - Bharat's app for daily news and videos

Install App

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

రామన్
శనివారం, 27 ఏప్రియల్ 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర ఐ|| తదియ ఉ.6.41 జ్యేష్ట రా.2.47 ఉ.వ.7.59 ల 9.37. ఉదు. 5.55 ల 7.33.
 
మేషం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడితప్పదు. ఇతరులు మీ పట్ల ఆకర్షితులౌతారు. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. అనుకున్నవి సాధించి, ఎనలేని తృప్తిని పొందుతారు. బంగారు, వెండి, వ్యాపారులకు లాభదాయకం ఉంటుంది. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషిచేస్తారు.
 
వృషభం :- నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పాత మిత్రులను కలుసుకొని వారితో ఉల్లాసంగా గడుపుతారు. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, అధికం. వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు. స్త్రీలకు బంధువుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
మిథునం :- మీ తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వ్యవసాయ రంగంలో వారికి వాతావరణంలో మార్పు సంతృప్తినిస్తుంది. మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టిజయం పొందండి. ఇతరుల వ్యవహరాలు, మొహమ్మాటాలకు దూరంగా ఉండండి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. 
 
కర్కాటకం :- విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు లాభిస్తాయి. పారితోషికాలు అందుకుంటారు. క్రీడల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరుగును. చిరు వ్యాపారులకు, చిన్నతరహాపరిశ్రమల వారికి అనుకూలం.
 
సింహం :- గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. కార్యసాధనలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఇబ్బందులు తప్పవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. నిరుద్యోగులు, అవివాహితులు శుభవార్తలు వింటారు.
 
కన్య :- శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. షాపింగ్లో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు చేసే పనులపై ఇతరుల దృష్టి ఉంటుంది. ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. 
 
తుల :- ఊహించని అవకాశాలు వస్తాయి. ప్రేమ వ్యవహారాలకు తగిన సమయం కాదు. పారిశ్రమిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి.
 
వృశ్చికం :- హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. కొబ్బరి, పానియ, పండ్ల, పూల, కూరగాయ చిరు వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. బ్యాంకులు, లావాదేవీలకు అనుకూలం. పోటి పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్త్రీలకు నూతన పరిచయాలు, చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి.
 
ధనస్సు :- ఎదురు చూడకుండానే మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పత్రికా సంస్థలోని వారికి విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. వాహనచోదకులకు మెళకువ వహించండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువుదక్కించుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలుబలపడతాయి.
 
మకరం :- మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. కమ్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
కుంభం :- రవాణా రంగంలోని వారికి చికాకులు వంటివి ఎదుర్కొంటారు. అతిథి మర్యాధలు బాగుగా నిర్వహిస్తారు. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి.
 
మీనం :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. హోటల్, బేకరీ, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మొండి బకాయిలు వసూలు కాగలవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

తర్వాతి కథనం
Show comments