Webdunia - Bharat's app for daily news and videos

Install App

25-08-2023 శుక్రవారం రాశిఫలాలు - వరలక్ష్మీదేవిని ఆరాధిస్తే..?

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (10:23 IST)
వరలక్ష్మీదేవి ఆరాధించిన, సకలకార్యసిద్ధి, ఐశ్వర్యాభివృద్ధి పొందుతారు.
 
మేషం:- రాబడికి మించిన ఖర్చుల వల్ల చేబదుళ్ళు తప్పవు. రిప్రజెంటేవ్ లు, ప్రైవేటు సంస్థలలోనివారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. బంధువులను కలుసుకుంటారు. దంపతుల మధ్య అనురాగ,వాత్సల్యాలు పెంపొందుతాయి. దైవ, ఆరోగ్య విషయాల పట్లఆసక్తి పెరుగుతుంది.
 
 
వృషభం :- స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఉపాధ్యాయులకు విద్యార్థులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. భాగస్వామిక, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి.
 
 
మిధునం:- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల కోసంమీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. కుటుంబీకులతో స్వల్ప విభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
 
కర్కాటకం:- నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. తరచు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. భార్య, భర్తల మధ్య కలహాలు, పట్టింపులు అధికమవుతాయి.
 
 
సింహం:- పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బందులెదుర్కుంటారు. మీ ఆనాలోచిత నిర్ణయాల వల్లకుటుంబంలో కలతలు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ఉపాధ్యాయుల శ్రమకుమంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
 
కన్య:- మీ సంతానం ధోరణి చికాకు పరుస్తుంది. సొంతంగా ఏదైనా చేయాలనే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
 
తుల:– పొగడ్తలు, హామీలకు దూరంగా ఉండాలి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. కొన్ని పనులువిసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో నూతన పరిచయాలు ఏర్పడతాయి.
 
 
వృశ్చికం:- ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీపనులు సానుకూలమవుతాయి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
 
ధనస్సు:- అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఖర్చులకు సరిపడు ఆదాయం సమకూర్చుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి.
 
 
మకరం: మీ వాక్చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. శత్రువులు పై జయం పొందుతారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులలో వ్యయం అధికమవుతుంది. ఉద్యోగలస్తులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు వంటివి పెరుగుతాయి.
 
 
కుంభం:- విద్యార్థులమొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యోములో సంతృప్తి కానవస్తుంది. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఉమ్మడి వ్యవహారాల్లో చికాకులు, భాగస్తులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, పనిభారం తగ్గుతాయి.
 
 
మీనం:- రాబడికి మించిన ఖర్చుల వల్ల చేబదుళ్ళు తప్పవు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. బంధువులతో పట్టింపులు వీడి సంబంధాలు పెంచుకుంటారు. కలప, ఐరన్, ఇటుక, ఇసుక, సిమెంటు వ్యాపారులకు పురోభివృద్ధి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

వ్యభిచార గుట్టు రట్టు.. ఇద్దరు మహిళలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

తర్వాతి కథనం
Show comments