Webdunia - Bharat's app for daily news and videos

Install App

21-09-2023 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీకుబేరుడిని ఆరాధించిన మీ ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు॥ షష్ఠి ఉ.10.08 అనూరాధ ప.12.49 సా.వ.6.19 ల 7.55. ఉ.దు. 9.55 ల 10.44 ప. దు. 2.50 ల 3.39.
 
లక్ష్మీకుబేరుడిని ఆరాధించిన మీ ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి.
 
మేషం :- ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు అధికమవుతాయి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు కలిసివస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయటం మంచిది. రవాణా రంగాల వారికి ఆందోళనలు అధికమవుతాయి.
 
వృషభం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానం వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు.
 
మిథునం :- పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దంపతులు మధ్య అనురాగ వాత్స్యాల్యాలు పెంపొందుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం :- వస్త్రములు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. పోగొట్టుకున్న అవకాశం, పత్రాలు తిరిగి పొందుతారు. వాతావరణ ప్రతిబంధకాలు, శ్రమాధిక్యత తప్పవు. ఉత్తర ప్రత్యుత్తరాలు, కీలక వ్యవహరాలు సమర్థంగా నిర్వహిస్తారు. శాంతి యుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి.
 
సింహం :- సహచరుల సలహావల్ల నిరుద్యోగులు సదావకాశాలు జారవిడుచుకుంటారు. అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కన్య :- వాతావరణంలోని మార్పులు వల్ల మీ పనులు వాయిదాపడతాయి. ట్రాన్స్‌పోర్టు రంగంలో వారికి పనివారితో చికాకులు తలెత్తుతాయి. వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. పెద్దలు ఇచ్చే సలహా మీ కెంతో సంతృప్తినిస్తుంది. ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు.
 
తుల :- పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్వార్ధపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువవ్వాలని భావిస్తున వారిని దూరంగా ఉంచండి. అకాల భోజనం, విశ్రాంతి లోపంవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. సోదరీ, సోదరులతో అభిప్రాయబేధాలు ఏర్పడతాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
వృశ్చికం :- పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
 
ధనస్సు :- స్త్రీలపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. గృహమునకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మకరం :- రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. మీ లక్ష్యం పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. అధికారులు సమీక్షా సమావేశాల్లో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య అపార్ధాలను తొలగిపోతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు జయం పొందుతారు.
 
కుంభం :- పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. అధైర్యపడకండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. సోదరి, సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
మీనం :- ఏది జరిగినా మంచికేనని భావించండి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు విదేశీ వస్త్రములు, అలంకరణలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్న భార్య వదినను చంపి ఆమె మృతదేహంపై అత్యాచారం చేసిన కామాంధుడు

cockfight: సంక్రాంతి కోడిపందేలు.. ఏర్పాట్లు పూర్తి.. రూస్టర్స్ కోసం ప్రత్యేక మెను

Facebook : ప్రేమ కోసం పాకిస్థాన్‌ బార్డర్ దాటితే.. ప్రేయసి షాకిచ్చింది

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదు.. అందుకే ఇంటర్‌తో ఆపేశా : పవన్ కళ్యాణ్

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

Bird Flies Into Your House? ఇంట్లోకి కాకి, పావురం వస్తే మంచిదేనా?

30-12-2024 సోమవారం దినఫలితాలు : పిల్లల దూకుడు అదుపు చేయండి...

డిసెంబరు 29 నుంచి జనవరి 04 వరకు మీ వార ఫలితాలు

Somvati Amavasya 2024 సోమాతి అమావాస్య.. చెట్లను నాటండి.. ఈశాన్య దిక్కులో నేతి దీపం..

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న శ్రీశైలం

తర్వాతి కథనం
Show comments