Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-09-2023 మంగళవారం దినఫలాలు - శ్రీ మహాలక్ష్మీని ఆరాధించిన సర్వదా శుభం...

Aquarius
, మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు|| చవితి ఉ.10.43 స్వాతి ప.12.09 సా.వ.5.52 ల 7.31. ఉ.దు.8.16 ల 9.06రా.దు. 10.49 ల 11.35.
 
మేషం :- స్త్రీలు షాపింగ్లో ఏకాగ్రత వహిస్తారు. వాతావరణంలోని మార్పులు వల్ల మీ పనులు వాయిదా పడతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఏ యత్నం ఫలించకపోవటంతో నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. నిరుద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
వృషభం :- మీరు ప్రారంభించిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. రాజకీయాలలోనివారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. విద్యుత్ రంగాల్లో వారు మాటపడవలసి వస్తుంది.
 
మిథునం :- ఆర్ధిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటి పైనే శ్రద్ధ వహించండి. మతిమరుపు కారణంగా ఇబ్బందు లెదుర్కుంటారు. కళా, క్రీడా రంగాలలోని వారికి కలిసిరాగలదు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
కర్కాటకం :- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలు విజయ వంతంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి.
 
సింహం :- శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. రాజకీయాలలో వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా కలిసివస్తుంది. ఉద్యోగ రీత్యా తరచూ దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం. అప్రయత్న కార్యసిద్ధి, ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడగలవు.
 
కన్య :- అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలుఫలిస్తాయి. ఇప్పటివరకు విరోధులుగా ఉన్న వ్యక్తులను సుముఖం చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. ఇతరుల సలహా విన్నప్పటికీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. రాజకీయనాయకుల పర్యటనల్లో ఇబ్బందులు వంటివి ఎదుర్కొనక తప్పదు.
 
తుల :- విదేశీ యానం రుణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. వృత్తుల్లో వారికి సమీప వ్యక్తుల సహకారం వల్ల అభివృద్ధి కానవస్తుంది. పెద్దల ఆహార వ్యవహారాలో మెళకువ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
వృశ్చికం :- పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో మెళకువ వహించండి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కోర్టుకు హాజరవుతారు. పెంపుడు జంతువుల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆడంబరాలకు, బంధుమిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు :- రావలసిన ధనం చేతికందడంతో మానసికంగా కుదుటపడతారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. క్రీడా, కళా, సాంస్కృక రంగాల పట్ల ఆశక్తి వహిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.
 
మకరం :- ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మనసుని లగ్నం చేసి, పనిపై శ్రద్ధ పెట్టి ఆశించిన ఫలితాలు వచ్చే వరకు శ్రమించండి. బంధువుల రాకవల్ల ప్రయాణాలు వాయిదా వేస్తారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి.
 
కుంభం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారిపట్టే ఆస్కారం ఉంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
మీనం :- స్త్రీల కోర్కెలు నెరవేరకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. దూరప్రదేశంలో ఉన్న సంతానాన్ని, బంధువులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. దుబారా ఖర్చులు అధికం. వీలైనంత వరకు రుణాలు చేయకుండా ఉంటేమంచిది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణపతిని ముందుగా పూజించమని చెప్పింది ఎవరు? దాని వల్ల ప్రయోజనాలు