Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-07-2023 గురువారం రాశిఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం....

Webdunia
గురువారం, 20 జులై 2023 (04:00 IST)
మేషం :- స్థిరాస్తి కొనుగోళ్ళకు సంబంధించిన వ్యవహారాలు వాయిదాపడతాయి. ఉద్యోగ, వృత్తుల వారికి ఆశించిన పురోభివృద్ధి ఉండదు. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. రావలసిన ధనం చేతికందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టుకు హజరవుతారు.
 
వృషభం :- రావలసిన మొండిబాకీలు వాయిదాపడతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీలో దయాగుణం వికసిస్తుంది. ధనాన్ని మంచి నీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు.
 
మిథునం :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు చుట్టు పక్కలవారితో విభేదాలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు ఎదురైనా మొండి ధైర్యంతో శ్రమించి పూర్తి చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. 
 
కర్కాటకం :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. ఉద్యోగస్తుల శ్రమను అధికారులు గుర్తిస్తారు. స్త్రీల తొందరపాటు నిర్ణాయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. విలువైనపత్రాలు చేజార్చుకుంటారు. ఆపత్సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
సింహం :- గృహంలో ఏవన్నా వస్తువులు పోవుటకు ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు అనుకూలం. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఆప్తులతో నిజాయితీగా మెలగండి. ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి ముఖ్యుల సహకారం వలన సమసిపోతాయి.
 
కన్య :- ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. కార్యసాధనలో ఒర్పు, పట్టుదల అవసరం. ఆలయాలను సందర్శిస్తారు.
 
తుల :- విద్యార్థుల పరిచయాలు మరింతగా బలపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలల్లో మిత్రుల సలహా పాటిస్తారు. బ్యాంక్ పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు వాయిదా పడతాయి. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. రుణ ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కుంటారు.
 
వృశ్చికం :- పోస్టల్, టెలిగ్రాఫిక్ రంగాలలో వారికి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. గతంలోని వ్యక్తులు తారసపడతారు. ప్రేమికుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ముఖ్యమైన వ్యక్తుల కలయిక వల్ల మేలు జరుగుతుంది.
 
ధనస్సు :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందించుట వలన మీకు సంఘంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య చికాకులు తలెత్తుతాయి. ఐరన్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మకరం :- రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ లక్ష్యం నెరవేరదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకువేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
మీనం :- మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మిత్రులనుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

తర్వాతి కథనం
Show comments