Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18-07-2023 మంగళవారం రాశిఫలాలు - లక్ష్మీకుబేరుడిని పూజించి, అర్చించిన శుభం...

Aquarius
, మంగళవారం, 18 జులై 2023 (04:00 IST)
మేషం :- వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, వాణిజ్య రంగాల్లో వారికి అనుకూలంగా ఉంటుంది. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తితో పాటు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. మీ నిజాయితీ, చిత్తశుద్ధి ప్రముఖులను ఆకట్టుకంటాయి.
 
వృషభం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, చిరు వ్యాపారస్తులకు సంతృప్తి, పురోభివృద్ధి. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది.
 
మిథునం :- కమ్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. సమయానికి మిత్రులు సహకరించక పోవటంతో అసహనానికి గురవుతారు. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు సంబంధించిన అధికారుల సహకారం అందుతుంది.
 
కర్కాటకం : నూతన వ్యాపారాలు, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచనమంచిది. మీ ఆలోచనా దృక్పథాన్ని మార్చుకొవాల్సిన సమయం. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండట మంచిది. ఉపాధ్యాయుల తొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తుతాయి.
 
సింహం :- ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. రుణయత్నాలలో కూడా స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ప్రతిష్ఠలకు కొంత విఘాతం కలిగే అవకాశం ఉంది. స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులెదుర్కుంటారు.
 
కన్య :- ఆర్థిక వ్యవహరాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. చిన్నారులు, ప్రియతములు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కార్యసాధనలో ఓరు, పట్టుదల అవసరం. మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. చివరిలో వ్యవహారాలు మందగిస్తాయి. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి.
 
తుల :- చిట్ ఫండ్, ఫైనాన్సు రంగాలలోని వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. హోటల్, తినుబండారాలు, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు కలిసివస్తుంది. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు.
 
వృశ్చికం :- ఆర్థికలావాదేవీల్లో తలెత్తిన వివాదాలను తెలివిగా పరిష్కరిస్తారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. గృహ నిర్మాణానికి కావలసిన ప్లానుకు ఆమోదం లభిస్తుంది. ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు.
 
ధనస్సు :- రావలసిన ధనం కొంత ముందువెనుకలుగానైన అందడం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూఉండదు. ఏ విషయమైనా గోప్యంగా ఉంచండి. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు. భాగస్వామిక చర్చలు అర్ధాంతరంగా ముగించాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాలల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ధి పొందాలని యత్నిస్తారు. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆథ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశాల్లోని ఆత్మీయులకు విలువైన వస్తుసామగ్రి అందజేస్తారు.
 
కుంభం :- వ్యాపారాల్లో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తారు. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాహన చోదకులకు చికాకులు ఎదురవుతాయి. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. ప్రతి విషయంలోను నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియచేయండి.
 
మీనం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. మిమ్ములను పొగిడేవారి పట్ల అప్రమత్తంగా మెలగండి. వృత్తి విద్యా కోర్సులలో రాణిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్తవహించండి. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17-07-2023 సోమవారం రాశిఫలాలు - సుబ్రమణ్యస్వామిని ఆరాధించిన మీ సంకల్పం...