Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-06-2023 మంగళవారం రాశిఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు...

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (04:00 IST)
మేషం :- శ్రీమతి, శ్రీవారు మధ్య అనుమానాలు అపోహలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో వచ్చి మనస్పర్థలు కాస్త సర్దుకుంటాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం.
 
వృషభం :- కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది.
 
మిథునం :- మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు.
 
కర్కాటకం :- సంగీత, సాహిత్య సదస్సులలో పాల్గొంటారు. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. రాబడికిమించిన ఖర్చులు ఉండటంతో అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలుంటాయి. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు బాగుగా కలిసివస్తుంది.
 
సింహం :- బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. కొనుగోళ్ళ విషయంలో ఏకాగ్రత వహించండి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. సోదరీ, సోదరుల కలయిక, పరస్పర అవగాహన కుదరదు.
 
కన్య :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి, శ్రీవారి ఆరోగ్యంలో జాగ్రత్త వహిస్తారు. ప్రముఖలతో వాగ్వివాదాలు మంచిది కాదని గమనించండి. విందులు, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయకండి.
 
తుల :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు మందకొడిగా వుంటుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. రావలసిన ధనం కోసం శ్రమ, ప్రయాసలు ఎదుర్కోనవలసి వస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృశ్చికం :- స్త్రీల వాక్చాతుర్యమునకు మంచి గుర్తింపు లభిస్తుంది. అసలైనశక్తి సామర్థ్యలను మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. మీ అతిథి మర్యాదలు బంధుమిత్రులను ఆకట్టుకుంటాయి. పాతమిత్రుల కలయిక వల్ల గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.
 
ధనస్సు :- అవివాహితులకు త్వరలోనే దూర ప్రాంతాల నుండి సంబంధాలు ఖాయమవుతాయి. విందులలో పరిమితి పాటించండి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి.
 
మకరం :- భాగస్వామిక చర్చల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్ద మొత్తం రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. దూర ప్రయాణాలు నిరుత్సాహపరుస్తాయి. బేకరి, పండ్ల, పూల, ఆల్కహాలు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి.
 
కుంభం :- ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. రావలసిన ధనం ఆలస్యంగా అందటం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. మీ బలహీనతలను కొంతమంది స్వార్థానికి వినియోగించుకుంటారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పరుషమైన మాటలు సంబంధాల్ని దెబ్బ తీస్తాయి.
 
మీనం :- శ్రీమతి, శ్రీవారుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు శ్రేయస్కరం కాదని గమనించండి. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. తిరుపతిలో ప్రొఫెసర్ అరెస్ట్

TTD: తెలంగాణ భక్తుల కోసం.. వారి సిఫార్సు లేఖలను అనుమతించాలి.. టీటీడీ

Sankranti Holidays: సంక్రాంతి సెలవులను ప్రకటించిన ఏపీ సర్కారు..

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD vaikunta ekadashi 2025 : ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం

24-12-2024 మంగళవారం దినఫలితాలు : ఆప్తుల సలహా పాటిస్తారు...

23-12-2024 సోమవారం దినఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త

22-12-2024 ఆదివారం దినఫలితాలు - రుణ సమస్యలు తొలగిపోతాయి..

Weekly Horoscope: 22-12-2024 నుంచి 28-12-2024 వరకు ఫలితాలు- మీ మాటలు చేరవేసే వ్యక్తులు?

తర్వాతి కథనం
Show comments