Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-06-2023 గురువారం రాశిఫలాలు - సాయిబాబాను ఆరాధించిన శుభం...

Advertiesment
Vastu purush
, గురువారం, 15 జూన్ 2023 (04:00 IST)
మేషం :- వ్యాపారస్తులు అప్పులు ఇవ్వకపోవడం చాలా మంచిదని గమనించండి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. రాజకీయనాయకులు తరచూ సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై దృష్టి పెడతారు. దూర ప్రదేశాలను సందర్శిస్తారు. స్వయంకృషితో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. 
 
వృషభం :- వృత్తి, ఉద్యోగాలలో సాధించిన విజయాలు మంచి గుర్తింపును తెచ్చిపెడతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో సమస్యలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది.
 
మిథునం :- సహాయం కోసం ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలో అధిక ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారి నుంచి సమస్యలు తలెత్తుతాయి. కళాకారులు ఒత్తిడి, చికాకులు వంటివి అధికంగా ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గతంలో నిలిచిపోయిన మొండిబాకీలు విశ్వప్రయత్నం చేసి వసూలు చేయగలుగుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
 
సింహం :- విద్యుత్, ఏసీ, మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. రాజకీయ నాయకులకు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ముఖ్యుల రాకతో సందడి నెలకొంటుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కన్య :- ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. మీవాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది.
 
తుల :- మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. మానసిక స్థైర్యంతో అడుగు ముందుకేయండి, అనుకున్నది సాధిస్తారు. అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. కొత్త రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు.
 
వృశ్చికం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహోపకరణాల వస్తువుల కొనుగోలుకై షాపింగ్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి.
 
ధనస్సు :- వ్యాపార వ్యవహారాల్లో జాయింట్ సమస్యలు రావచ్చును. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయటం వలన ఆశాంతికి లోనవుతారు. ఎదుటివారి వేషధారణ చూసి మోసపోయే ఆష్కారం ఉంది. జాగ్రత్త వహించండి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాత మొండిబాకీలు వసూలవుతాయి.
 
మకరం :- పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. లిటిగేషన్ వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాభివృద్ధికైచేయు కృషిలో పోటీ అధికమవ్వటంతో ఆందోళన తప్పదు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
కుంభం :- ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కోర్టు వాజ్యాలను ఉపసంహరించుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించటంవల్ల మేలే జరుగుతుంది. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. మీ సంతానం కోసం విలువైన వస్తువులను సేకరిస్తారు.
 
మీనం :- బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహాం, సందడి చోటుచేసుకుంటాయి. స్త్రీలకుస్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాలయ పక్షం 14 రోజులు.. అన్నదానం చేస్తే..?