Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-06-2023 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం...

Advertiesment
astrolgy
, బుధవారం, 14 జూన్ 2023 (04:06 IST)
మేషం :- వృత్తుల వారికి సదావకాశాలు లభించినా ఆశించినంత సంతృప్తి ఉండదు. అనుకున్న పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. రావలసిన ధనం అందటంతో కుదుటపడతారు.
 
వృషభం :- ఉద్యోగస్తులు మార్పులకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ పథకాలు, ప్రణాళికలు గోప్యంగా ఉంచండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. ఇతరుల వాహనం నడపడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి పురోభివృద్ధి సాధిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం.
 
కర్కాటకం :- రాజకీయాల్లో వారికి ఒత్తిడి, ఆందోళన తప్పదు. మీ శ్రీమతి ఓదార్పుతో మీలో మనోధైర్యం నెలకొంటుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. హామీలు ఇచ్చే విషయంలోను, మధ్యవర్తిత్వ వ్యవహారాలలో మెళకువ వహించండి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
సింహం :- ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా మనశ్శాంతి లోపిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వస్తువు కొనుగోలులో నాణ్యత గమనించాలి గత అనుభావాలతో లక్ష్యాలు సాధిస్తారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. కుటింబీకులతో కలసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
కన్య :- ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. బంధువుల రాక పోకలు అధికమవుతాయి. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి కాగలవు. ఆస్తి వ్యవహారాల్లో దాయాదుల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
తుల :- వృత్తి వ్యాపారాల్లో మొహమ్మాటాలు, ఒత్తిళ్లకు తావివ్వవద్దు. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ సహకారాలు అందిస్తారు. దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. మిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
వృశ్చికం :- ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. విందులు, దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడాలుంటాయి.
 
ధనస్సు :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలు కొత్త వ్యక్తులతో తక్కువగా సంభాషించండి మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం అధికం. రాజకీయ, కళలు, సినీరంగాల వారికి ప్రోత్సాహకంరంగా ఉంటుంది. భర్యా, భర్తల మధ్య అవగాహన లేక చికాకులు వంటివి ఎదుర్కుంటారు. 
 
మకరం :- గృహంలోవిలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో మెలకువ వహించండి. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. విద్యార్థులకు వాహనం నడుపు తున్నపుడు ఏకాగ్రత ముఖ్యం.
 
కుంభం:- ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. రుణాలు తీర్చి తాకట్టులు విడిపించుకుంటారు. మిత్రులవల్ల మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. కవి, పండితులకు, కళాకారులకు సంఘంలో ఆదరణ లభిస్తుంది.
 
మీనం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. వాతావరణంలో మార్పు వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. మీరు ప్రతీ పనిని స్వయంగా చేయడం వల్ల సుఖపడతారు. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-06-2023 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధిస్తే శుభం