Webdunia - Bharat's app for daily news and videos

Install App

18-11-2022 శుక్రవారం దినఫలాలు - సాయిబాబా గుడిలో పూజలు చేస్తే...

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (04:05 IST)
మేషం :- మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు. తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవటం క్షేమంకాదు.
 
వృషభం :- స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. బ్యాంకు ఉద్యోగులు విధినిర్వహణలో అలసత్వంతో ప్రమాదంలో పడే సూచనలున్నాయి. అయిన వారిని ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు.
 
మిథునం :- ఏ విషయంలోనూ మీ శ్రీమతికి ఎదురు చెప్పటం మంచిది కాదు. కొబ్బరి, పండ్ల, పూల, హోటల్, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.
 
కర్కాటకం :- రుణవిముక్తులు కావటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. మీ ఏమరు పాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. ప్రముఖుల కలయిక వల్ల మీ సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. వృత్తిరీత్యా ప్రయాణాలు, చికాకులు ఎదుర్కుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
సింహం :- అసాధ్యమనుకున్న దానిని సాధించి మీ సత్తా చాటుకుంటారు. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో అధికమైన జాగ్రత్త అవసరం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారంఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కన్య :- గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. ప్రేమికులకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. వాహనంపై దూరప్రయాణం మంచిది కాదు. స్త్రీలకుషాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి.
 
తుల :- పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. రుణం తీర్చటానికి చేయుయత్నాలు ఫలించవు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు బదలీ ఉత్తర్వులు అందుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్లీ పెరుగుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి.
 
వృశ్చికం :- వైద్య రంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. మీ అవసరాలకు కావలసిన వనరులు సర్దుబాటు కాగలవు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలెదురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి తప్పదు. ఒక వ్యవహారం నిమిత్తం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
ధనస్సు :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ ఆశయాలకు తగినవ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. ఖర్చులు అధికమైనా సంతృప్తి, ప్రయోజనం పొందుతారు.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించండి. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగస్తుల తొందరపాటు స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యవసాయరంగాల వారికి నిరుత్సాహం తప్పదు. ఇతరుల సలహా విన్నప్పటికీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
 
కుంభం :- ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ప్రేమికులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆస్తి వ్యవహరాల్లో కుటుంబీకుల మధ్య అవగాహన లోపిస్తుంది. ప్రయాణాలు, తీర్థయాత్రలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
మీనం :- ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఉండదు. గత కొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు అధికం. పాత మిత్రుల సహకారం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

తర్వాతి కథనం
Show comments