Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-11-2022 సోమవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం...

Advertiesment
Maha Shivaratri
, సోమవారం, 14 నవంబరు 2022 (04:00 IST)
మేషం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. తరచూ సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరి, సోదరుల మధ్య కలహాలు, పట్టింపులు అధికమవుతాయి. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.
 
వృషభం :- సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరించ గలుగుతారు. వైద్యులకు సమస్యలు, ప్లీడర్లకు ప్రోత్సాహం కానవస్తుంది. ఉపాధ్యాయులకు సరస్పర అవగాహనా లోపం. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో మెళుకువ వహించండి.
 
మిథునం :- వ్యాపారాభివృద్ధి, విస్తరణల కోసం చేసే యత్నాలు క్రమంగా సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన సమాచారం అందుతుంది. మీ వాక్ చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
 
కర్కాటకం :- స్త్రీలకు పనివారలతో ఒత్తిడులను, చికాకులను ఎదుర్కుంటారు. ఖర్చులు పెరిగినా ఇబ్బందులే మాత్రం ఉండవు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. శత్రువులపై జయం పొందుతారు. ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తి నిస్తుంది.
 
సింహం :- దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. వ్యాపారాల విస్తరణకు సంబంధించిన విషయాల్లో పెద్దల సలహా తీసుకోవటం శ్రేయస్కరం. దూర ప్రయాణాలలో ఊహించని ధననష్టం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
కన్య :- నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు చికాకులు తప్పవు. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు శుభదాయకం. వివాహం నిశ్చయం కావటంతో అవివాహితులలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ఖర్చులు మీ స్లోమతకు తగినట్లుగానే ఉంటాయి.
 
తుల :- ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పని ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు నూతన పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. దుబారా ఖర్చులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
వృశ్చికం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకు ప్రకటనలు, స్కీంల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
ధనస్సు :- మీ సంతానం వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు, సంస్థలు, పరిశ్రమల స్థాపనలు అనుకూలిస్తాయి. ఖర్చులు, కుటుంబ అవసరాలు అధికమవుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం చేతికందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
మకరం :- ఆర్థిక సమస్యలు, ఇతర చికాకులు తొలగి మాసికంగా కుదుటపడతారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రైవేటు, పత్రిక సంస్థలలోని వారికి, రిప్రజెంటేటిలకు ఒత్తిడి, పనిభారం సమస్యలు తప్పవు.
 
కుంభం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోనివారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. గృహ మరమ్మతులు, మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి ఆమోదం లభిస్తుంది.
 
మీనం :- ఇప్పటివరకు వాయిదా పడుతున్న వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. రాజకీయ నాయకులకుదూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-11-2022 ఆదివారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణ చేసినా.... (video)