Webdunia - Bharat's app for daily news and videos

Install App

16-11-2023 గురువారం దినఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన శుభం...

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక శు॥ తదియ ప.12.53 మూల తె.3.26 ఉ.వ.11.49 ల 1.24 రా.వ.1.54 ల 3.26. ఉ.దు. 9.49 ల 10.35 ప.దు. 2.23 ల 3.09.
 
సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన శుభం కలుగుతుంది.
 
మేషం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించండం మంచిది. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. రావలసిన ఆదాయం గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలు ఎదుర్కుంటారు.
 
వృషభం :- కాంట్రక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు సమస్యలకు దారితీయవచ్చు. ఉద్యోగస్తుల శ్రమకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. విద్యార్ధినులకు వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం.
 
మిథునం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహరాలు సమర్థంగా నిర్వహిస్తారు. రియల్ ఎస్టేట్‌రంగాల వారికి నూతన వెంచర్లు, అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది, ధనవ్యయంలో ఏకాగ్రత వహించండి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం :- వస్త్ర, ఫ్యాన్సీ, బేకరి వ్యాపారులకు పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తుల శక్తి, సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు.
 
సింహం :- ఉద్యోగస్తులకు తోటివారి నుండి ఆహ్వానాలు అందుతాయి. మీ సంతానం ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దూర ప్రయాణాల్లో మెళకువ, వస్తువులపట్ల జాగ్రత్త అసవరం. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఒత్తిడి, జాప్యం వంటి ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
కన్య :- వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు అర్థాంతరంగా నిలిపివేయయవలసి వస్తుంది. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల వ్యవహారంలో ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
తుల :- పెద్దలు, ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు ప్రగతిపథంలో సాగుతాయి. విద్యార్థుల అత్యుత్సాహం విపరీతాలకు దారితీసే ఆస్కారం ఉంది. మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ధన వ్యయం విపరీతంగా ఉన్నా ప్రయోజనకరంగాఉంటాయి.
 
వృశ్చికం :- ఖర్చులు సామాన్యంగా ఉన్నా ధనవ్యయం విషయంలో అదుపు అవసరమని గమనించండి. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. పారిశ్రామిక రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి.
 
ధనస్సు :- కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. స్త్రీల ఓర్పు, ఏకాగ్రతలకు ఇది పరీక్షా సమయం. దూర ప్రయాణాల్లో అసౌకర్యం, చికాకులు తప్పవు. రుణ యత్నాలలో అనుకూలత, రావలసిన ధనం అందుకుంటారు.
 
మకరం :- మీ ఆశయ సాధనకు సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఖర్చులు ముందుగానే ఊహించినవి. కావటంతో అవసరాలకు సరిపడు ధనం సమకూర్చుకుంటారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయటం మంచిది.
 
కుంభం :- కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు, రాణింపులభిస్తుంది. సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో పొల్గొంటారు. విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మీనం :- ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం, విరక్తి కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. విద్యార్థినులకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ముఖ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించవలసి ఉంటుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

2024లో తిరుమల వేంకటేశుని హుండీ ఆదాయం రూ. 1365 కోట్లు

02-01-2025 గురువారం దినఫలితాలు : బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు...

01-01-2025 బుధవారం దినఫలితాలు : గృహం సందడిగా ఉంటుంది...

01-01-2025 నుంచి 31-01-2025 వరకు ఫలితాలు మీ మాస ఫలితాలు

31-12-2024 మంగళవారం రాశిఫలాలు : రుణ సమస్యలు తొలగిపోతాయి..

తర్వాతి కథనం
Show comments