Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-11-2023 సోమవారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణ చదివినా....

Advertiesment
horoscope
, సోమవారం, 13 నవంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ బ॥ అమావాస్య ప.2.19 విశాఖ తె.3.49 ఉ.వ.8.48 ల 10.27. ప.దు.12.06 ల 12.51 పు.దు. 2.22 ల 3.07.
సూర్య నారాయణ పారాయణ చదివినా లేక విన్నా అన్నివిధాలా కలిసివస్తుంది.
 
మేషం :- కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలో విజయాన్ని సాధిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు తప్పవు.
 
వృషభం :- కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటు చేసుకుంటుంది. టెక్నికల్, మెడికల్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి.
 
మిథునం :- మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు ఆధ్మాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విద్యార్థులకు స్థిరబుద్ధి అవసరమని గమనించండి.
 
కర్కాటకం :- ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం విరమించుకోవటం శ్రేయస్కరం. బంగారం, వెండి, వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు, ఆందోళన కలిగిస్తుంది.
 
సింహం :- ఉద్యోగస్తులకు విధినిర్వహణలో తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీలు టి.వి కార్య క్రమాలు, కళాత్మక పోటీల్లో రాణిస్తారు. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వృతిపరంగా ఎదురైన సమస్యలను అధికమిస్తారు.
 
కన్య :- నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోగతి కానరాగలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనేక పనులు చేపట్టుట వలన దేనిలోనూ ఏకాగ్రత వహించలేరు. ప్రయాణాలలో వస్తువులు పోయే ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి.
 
తుల :- ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని అనుకున్న పనులు పూర్తికావు. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించడం మంది. రుణయత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కుంటారు. ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. కోర్టు వ్యవహరాలు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు.
 
వృశ్చికం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ఏ విషయంలోను సోదరుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. బ్యాంకింగ్ వ్యవహరాల్లోను, అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ వహించండి. విదేశీయానం యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. మీ ఔన్నత్యాన్ని ఎదుటివారు గుర్తిస్తారు.
 
ధనస్సు :- ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. అకాల భోజనం, శ్రమాధిక్త వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొక ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. మీ కష్టం ఫలించటంతో అనిర్వచనీయమైన ఆనందం పొందుతారు. దైవకార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది.
 
మకరం :- నిరుద్యోగులు బద్దకాన్ని వదలి చురుగ్గా ఉండండి. రాజకీయాల్లో వారికి ఆదరాభిమానాలు అధికం అవుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రింటింగ్ రంగాల్లోవారికి అచ్చుతప్పులు పడటంవల్ల మాటపడతారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం.
 
కుంభం :- ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేయటం వల్ల ఇబ్బందులకు గురికావలసివస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తుల సహాయం పొందుతారు. ఆరోగ్య, ఆహార విషయాల్లో అధికమైన జాగ్రత్త అవసరం.
 
మీనం :- వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు, తగిన ప్రతిఫలం లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. మీ అవసరాలు, బలహీనతలను ఇతరులు స్వార్థానికి వాడుకుంటారు. మిత్రులను కలుసుకుంటారు. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగులలో నిరుత్సాహం, నిర్లిప్తత అధికమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-11-2023 ఆదివారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించినట్లైతే..