Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-11-2023 శుక్రవారం రాశిఫలాలు - శ్రీ మహాలక్ష్మీని ఆరాధించిన మీ సంకల్పం...

Advertiesment
Shukra Vakri 2023
, శుక్రవారం, 10 నవంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ బ॥ ద్వాదశి ఉ.11.21 హస్త రా.11.56 ఉ.వ.6.55 ల 8.40. ఉ.దు. 8. 19 ల 9.05 ప. దు. 12.07 ల 12.52.
 
శ్రీ మహాలక్ష్మీని ఆరాధించిన మీ సంకల్పం నెరవేరుతుంది.
 
మేషం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. మీ మాటకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిదానంగానైనా మీరు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభించగలవు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు అధికం. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
వృషభం :- ఉద్యోగస్తులు కొత్తగా వచ్చిన అధికారులకు మరింత సన్నిహితులవుతారు. పోటీ పరీక్షల్లో మీ సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. మందులు, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఆకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
మిథునం :- స్త్రీలు ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల దేనిలోను ఏకాగ్రత వహించలేరు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలుకాగలవు. ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషం వల్ల చికాకులు తప్పవు. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం :- శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. ఖర్చులు, చెల్లింపులలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. బంధు మిత్రుల కలయిక వల్ల నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. విధినిర్వహణలో ఉద్యోగులు చూపిన సమయస్ఫూర్తికి అధికారుల నుంచి ప్రశంసలు, తగిన ప్రతిఫలం లభిస్తాయి.
 
సింహం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలు ఉపవాసాలు, శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు. మీ పనులు మందకొడిగా సాగడం, జాప్యం వంటి చికాకులను ఎదుర్కుంటారు.
 
కన్య :- రాజకీయ, కళా రంగాలవారికి విదేశీ పర్యటనలు సంభవం. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాందీ పలుకుతాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రైవేటు ఫైనాన్సుదారుల ఒత్తిడి అధికమవుతుంది.
 
తుల :- హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసివస్తుంది. దంపతుల మధ్య సఖ్యతలోపం, చికాకులు తలెత్తుతాయి. స్త్రీల ఆరోగ్యంలో మెళకువ అవసరం. సోదరీ సోదరుల వైఖరిలో మార్పును గమనిస్తారు. ఒకానొక సందర్భంలో కుటుంబీకుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
వృశ్చికం :- స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుకుంటారు. దైవకార్యాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వటం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు.
 
ధనస్సు :- రావలసినధనం చేతికందటంతో పొదుపు దిశగామీ ఆలోచనలుంటాయి. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. వార్తా సంస్థలలోని వారికి తోటివారితో అభిప్రాయ భేదాలు, ఇతరత్రా చికాకులు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు విచారణకువస్తాయి.
 
మకరం :- ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. చిన్న పొరపాట్లే పెద్ద సమస్యకు దారితీస్తాయి. సన్నిహితుల ప్రోత్సాహంతో దైవదీక్షలు స్వీకరిస్తారు. బ్యాంకు పనులు ఆలస్యం కావటంతో నిరుత్సాహం చెందుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. కొన్ని సందర్భాల్లో మిత్రుల తీరు అసహనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు సమస్యలెదురైనా ఆదాయానికి లోటుండదనే చెప్పవచ్చు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
మీనం :- స్త్రీలు తొందరపడి సంభాషించడం వల్ల మాటపడక తప్పదు. రుణాలు చేబదుళ్ళకు యత్నాలు సాగిస్తారు. కొన్ని రహస్యాలు దాచి పెట్టాలనుకున్నాసాధ్యంకాదు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు కలిసివస్తుంది. మీ తప్పులు సరిదిద్దుకునేందుకు శ్రమిస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-11-2023 గురువారం రాశిఫలాలు - సాయిబాబా ఉండే గుడి ధునిలో రావి సమిధలను వేసిన శుభం..