Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

06-11-2023 సోమవారం రాశిఫలాలు - కుబేరుడిని పూజించిన ఆర్ధికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి..

Astrology
, సోమవారం, 6 నవంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ ఐ॥ నవమి తె.5.18 ఆశ్రేష ప.2.09 తె.వ.3.27 ల 5.13. ప.దు. 12.06 ల 12.51 పు.దు.2.22 ల 3.07.
కుబేరుడిని పూజించిన ఆర్ధికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, పురోభివృద్ధి చేకూరుతుంది.
 
మేషం :- కొన్ని బంధాలలో మార్పు ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఇంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రశాంతను పొందగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. విద్యార్థుల ఏకాగ్రతా లక్ష్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం :- ఇతరులు మీ ప్రభావానికి లోనవుతారు. అధికంగా ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. అహాన్ని అదుపులో పెట్టి మీ శ్రేయేభిలాషులు ఇస్తున్న సలహా, సహకారాన్ని అందిపుచ్చుకొండి. గృహంలో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వస్తువులపట్ల, వస్త్రలపట్ల, ఆభరణాలపట్ల ఆసక్తిపెరుగుతుంది.
 
మిథునం :- ఎప్పటనుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభం అవ్వడంవల్ల కాంట్రాక్టర్లకు నూతన ఉత్సాహం కానవస్తుంది. క్షణికోద్రేకం వల్ల స్త్రీలు అపవాదులను ఎదుర్కొంటారు. ఎలక్ట్రానిక్, మీడియా రంగాలవారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రేమలో ఓటమిని ఎదుర్కొనవచ్చు జాగ్రత్త వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కర్కాటకం :- ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. టాక్స్ వంటి సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించవు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. విద్యార్థులలో కన్నా విద్యార్థునులలో పురోభివృద్ధి కానవస్తుంది.
 
సింహం :- వృత్తి వ్యాపారస్తులకు గుర్తింపు, రాణింపు లభిస్తాయి. ఒక వ్యక్తి మీ జీవితంలోకి తారసపడటంవల్ల మీ జీవితం ఊగిసలాడవచ్చు. ఆలోచనలను అదుపులో పెట్టుకొండి. ఎలక్ట్రికల్, టెక్నికల్ రంగాలవారికి కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉపాధ్యాయులు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించవు.
 
కన్య :- వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ధనం ఏ మాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళన తప్పదు. భాగస్వామ్యుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సాంఘిక, సంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక్కొసారి కఠోరంగా వ్యవహరించడంవల్ల ఎదుటివారు మిమ్మల్ని తక్కువ అంచనావేయవచ్చు.
 
తుల :- తప్పని సరిగా రుణం చేయవలసి వస్తుంది. హామీలు ఉండటంవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. పండ్ల, పూల, కొబ్బరి వ్యపారస్తులకు కలిసివచ్చేకాలం. ఉదాశీనంగా వ్యవహరించడంవల్ల కించిత్ ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. ట్రాన్సుపోర్టు, ఆటో, మోబైల్ రంగాలవారికి పని భారం అధికమవుతుంది.
 
వృశ్చికం :- వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి అచ్చు తప్పుల వల్ల మాటపడక తప్పదు. శాస్త్రజ్ఞులకు పరిశోధకులకు, రచనా రంగాలలోని వారికి రాణింపు లభిస్తుంది. ప్రైవేటు రంగాలలో వారికి పురోభివృద్ధి, గుర్తింపు కానవస్తుంది. మీ దగ్గర వ్యక్తుల సహకారం మీకు బాగుగా లభిస్తుంది.
 
ధనస్సు :- కష్టపడి పని చేసే మీ తత్వం మీకు సహకరిస్తుంది. విద్యార్థులకు దురలవాట్లకు లోనయ్యే అవకాశం ఉంది. హోటల్ తినుబండారు వ్యాపారస్తులకు ఆశాజనకం. మీ ప్రేమ వ్యవహారాలు మిత్రులకు తెలియజేడయం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. వాహనం అమర్చుకోగలుగుతారు.
 
మకరం :- గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలమైన కాలం. నవసరపు ఆడంబరాలకు పోయి ఇబ్బందులకు గురి కాకండి. ధనం ఏ మాత్రం నిల్వ చేయలేకపోతారు. గతంలో మీ జీవితంలో ప్రవేశించిన వ్యక్తి మళ్ళీ మీకు తారసపడతాడు. వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొనే ఆలోచనలు విరమించండి.
 
కుంభం :- వస్త్ర విషయాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. పాత వ్యవహారాలు జ్ఞప్తికి వస్తాయి. అపరిచరితులతో జాగ్రత్త వహించండి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. విద్యార్థులకు, స్త్రీలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అలంకార ప్రాప్తి. ధనం సమయానికి సమకూరడం వల్ల ఆర్థికంగా ఒక అడుగు ముందుకువెళ్తారు.
 
మీనం :- సినిమా, కళా రంగాలవారికి చికాకు తప్పదు. సంగీత, సాహిత్య కళా రంగాలవారికి తగినంత అభివృద్ధి ఉండదు. పెద్దలను ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారస్తులు ఒక ప్రణాళిక ప్రకారం వ్యాపారం చేయడం వల్ల పురోభివృద్ధి పొందుతారు. విద్యార్థులకు బుద్ధి మందగిస్తుంది. ప్రేమికులకు బహుమతులు అందజేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-11-2023 ఆదివారం రాశిఫలాలు - సూర్యుని ఆరాధించిన ఆర్ధికాభివృద్ధి...