Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

01-11-2023 బుధవారం రాశిఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి...

Astrology
, బుధవారం, 1 నవంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ బ|| చవితి రా.10.48 మృగశిర పూర్తి ఉవ. 11.53 ల 1.31.
ప.దు. 11.21 ల 12.07.
 
మహావిష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి పొందుతారు.
 
మేషం :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, రాయభారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలు విందులు, వినోదాల్లో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. ఖర్చులు అధికం. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
వృషభం :- వృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి నిరుత్సాహం తప్పదు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయాల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. విద్యార్ధినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. పారిశ్రామిక రంగంలోని వారికి సామాన్యం. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి.
 
మిథునం :- వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. ఉత్తర ప్రత్యుత్తరాలు, రాయబారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఖర్చులు పెరిగినా అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. విందులలో పరిమితి పాటించండి. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
కర్కాటకం :- గృహ మార్పిడి యత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, శాస్త్ర, పరిశోధనా రంగాల వారికి ఆశాజనకం. క్రీడ, కళాకారులకు సదావకాశాలు లభిస్తాయి. విందుల్లో అతిగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు.
 
సింహం :- సంగీత, నృత్య, సాహిత్య కళాకారులకు గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. విదేశీయానం, తీర్థయాత్రలకు చేయుయత్నాలు ఫలిస్తాయి. వృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. నూతన పరిచయాలు, వ్యాపకాలు తప్పుదోవ పట్టించేందుకు ఆస్కారముంది.
 
కన్య :- వస్త్రాలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. విందులు, వినోదాలలో అతిగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు. స్త్రీలకు శ్రమాధిక్యత, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
తుల :- ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొంతమంది మీ నుండి ధనసహాయం కోరవచ్చు. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ మాటకు ఇంటా, బయటా ఆమోదం లభిస్తుంది.
 
వృశ్చికం :- విద్యార్ధులు ప్రేమ వ్యవహరాల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కోర్టు వ్యవహరాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి.
 
ధనస్సు :- దైవ, పుణ్య, సేవా కార్యక్రమల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు వైద్య సలహా, ఔషధ సేవనం తప్పదు. విద్యార్ధులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ప్రముఖులను కలుసుకున్నా ఫలితం ఉండదు. ఫ్యాన్సీ, మందులు, వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు, పనిభారం, చికాకులు తప్పవు.
 
మకరం :- ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. క్యాటరింగ్ హోటల్, తినుబండారాల వ్యాపారాలు సంతృప్తి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా చికాకులు తప్పవు. పాత మిత్రుల కలయికతో కొత్త ఉత్సాహానికి గురవుతారు.
 
కుంభం :- ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం, మందకొడితనం వల్ల ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి. రుణ విముక్తి, కుటుంబ సౌఖ్యం వంటి శుభపరిణామాలుంటాయి.
 
మీనం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీరు చేసే యత్నాలకు సన్నిహితుల తోడ్పాటులభిస్తుంది. ధనవ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెళకువ వహించండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

31-10-2023 మంగళవారం రాశిఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం...