Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

27-10-2023 శుక్రవారం రాశిఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...

Astrology
, శుక్రవారం, 27 అక్టోబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ శు॥ చతుర్ధశి తె.3.45 ఉత్తరాభాద్ర ఉ.9.17 రా.వ.8.37 ల 10.07. ఉ. దు. 8.16 ల 9.03 వ. దు. 12.12 ల 1.00.
లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం కలుగుతుంది.
 
మేషం :- రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికం. ఉద్యోగస్తులకు పై అధికారులను మంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.
 
వృషభం :- నిర్మాణ పథకాలలో మెళకువ వహించండి. అనుకోని ఖర్చులు, ఇతరత్రా సమస్యల వల్లమానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాలను చేజిక్కించుకోవటం శ్రేయస్కరం. మీ సోదరుని మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
మిథునం :- బంధువులతో సత్సంబంధాలు నెలకొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయబేధాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి పనిలోను ఎదుటివారి నుండి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 
 
కర్కాటకం :- ఉద్యోగస్తుల సమర్థత, సీనియారిటీకి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తలెత్తుతాయి. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పని భారం పెరుగుతుంది. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొటారు.
 
సింహం :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. రాజకీయాల వారికి రహస్యపు విరోధులు అధికమవుతున్నారు గమనించండి.
 
కన్య :- ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. సహాయ సహకారాలు అందించుటవల్ల మీకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మిత్రులు మీ నుండి ధన సహాయం కోరవచ్చు. స్త్రీలు వస్త్ర, ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి.
 
తుల :- ప్రవేటు సంస్థలలోని వారు మార్పులకైయత్నాలు ఆటంకాలు తప్పవు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఎరువులు, క్రిమి సంహారక మందుల వ్యాపారులకు చికాకులు తప్పవు. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్ళు తీసుకోక తప్పవు.
 
వృశ్చికం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తులను ఓ కంట కనిపెట్టడం మంచిది. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు.
 
ధనస్సు :- గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
మకరం :- విద్యా, వైజ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి పెరుగును. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఉద్యోగం ప్రమోషన్, ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు అందుతాయి. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు సంతృప్తికరంగా పూర్తిచేస్తారు.
 
కుంభం :- దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. సభ సమావేశాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా వుండగలదు. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు.
 
మీనం :- స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి పంపకాల్లో సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. కోర్టు వ్యవహరాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారికి అదృష్టం..