Webdunia - Bharat's app for daily news and videos

Install App

16-10-2022 ఆదివారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణ చేసినా...

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (04:00 IST)
మేషం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. అపరిచిత వ్యక్తులతో ఆచితూచి సంభాషించండి. వాహనం ఇతరులకు ఇచ్చేటప్పుడు లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీల కోరికలు, మనోవాంఛలు నెరవేరగలవు.
 
వృషభం :- బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. వాదనలు, పోట్లాటల్లో మీ శక్తిని వృధా చేసుకుంటారు. పెద్దల ఆహార, ఆరోగ్యంలో మెళకువ చాలా అవసరం. మీ సంతానం మొండితనం అసహనానికి గురవుతారు. దైవదర్శనాల్లో చికాకు లెదురవుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు.
 
మిథునం :- చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. పాత రుణాలు తీరుస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
కర్కాటకం :- పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలు పనివారల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. లౌక్యం, సర్దుబాటు ధోరణితో వ్యవహరించటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.
 
సింహం :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కుటుంబీకులతో కలసి ఆనందంగా గడుపుతారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. పాత వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
కన్య :- స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తప్పవు మెళకువ వహించండి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. ప్రముఖుల కలయికతో మీ కార్యక్రమాలలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
 
తుల :- ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో పరిచయాలేర్పడతాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. పాత మిత్రులను కలుసుకుంటారు.
 
వృశ్చికం :- బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. రవాణారంగంలో వారికి సంతృప్తి. బంధువుల రాకవల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. సభలు, సమావేశాల్లో మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం.
 
మకరం :- కొన్ని వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా అనుకూలిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వ్యాపార రంగంలోని వారికి గణనీయమైన అభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం.
 
కుంభం :- మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయనాయకులు తరచూ సభాసమావేశాలలో పాల్గొంటారు. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. స్త్రీలు పనివారల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
మీనం :- కుటుంబీకులను అనుమానించడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. మీ సంతానం వివాహ, విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో వృషభరాశికి విద్యా జాతకం ఎలా వుంటుంది..?

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

25-11 - 2024 సోమవారం వారం ఫలితాలు - రుణ సమస్యలు పరార్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

తర్వాతి కథనం
Show comments