Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-10-2022 శనివారం దినఫలాలు - విష్ణుసహస్రనామం చదివితే సర్వదా శుభ...

Advertiesment
Lord Vishnu
, శనివారం, 15 అక్టోబరు 2022 (04:00 IST)
మేషం :- బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. ఉద్యోగస్తులకు పై అధికారులతో సదావగాహన, తోటివారి సహకారం లభిస్తుంది.
 
వృషభం :- ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయలేర్పడతాయి. అధైర్యంవదలి ధైర్యంతో ముందుకు సాగి జయం పొందండి. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు.
 
మిథునం :- ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. స్త్రీలకు బంధువర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతాయి. కోర్టు వ్యవహారాలుకొత్త మలుపు తిరుగుతాయి.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖం. రాజకీయనాయకులు సభ, సమావేశాలు, వేడుకల్లో ఖర్చులు అధికం. గృహంలో ఏదైనా వస్తువు సమయానికి కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, సదావకాశాలు లభిస్తాయి.
 
సింహం :- మీ అలవాట్లు, మాటతీరు మార్చుకోవటం మంచిది. రావలసిన ధనం ఆలస్యంగా అందటం వల్ల ఒడిదుడుకులు తప్పవు. తరుచూ సేవ, దైవ కార్యాల్లో పాల్గొంటారు. బ్యాంకు పనులు హడావిడిగా ముగిస్తారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
కన్య :- తాపీపనివారు, నిరుద్యోగులు తొందరపాటు తనంవల్ల సదావకాశాలు జారవిడుచుకుంటారు. సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. తరుచు బంధు మిత్రులను కలుసుకుంటారు. 
 
తుల :- స్త్రీలు షాపింగ్ కోసం ధనం ఖర్చుచేస్తారు. రిప్రజెంటిటివ్‌లకు, ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. అధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహించలేరు. ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. వారసత్వపు ఆస్తుల పంపకం జరుగుతుంది. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
వృశ్చికం :- పత్రిక, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. బంధువుల రాక వల్ల గృహంలో సందడి కారవస్తుంది. ముఖ్యుల నుండి ధన సహాయం లభించడంతో ఒకడుగు ముందుకు వేస్తారు. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవటం ఇబ్బందిగా ఉంటుంది.
 
ధనస్సు :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. స్త్రీలకు దూర ప్రయాణాలలో కొత్త వ్యాపకాలు, పరిచయాలు ఏర్పడతాయి. కళాకారులకు, సినిమా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ఏదన్నా అమ్మకానికై చేయుప్రయత్నాలు వాయిదా పడగలవు.
 
మకరం :- ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఋణం ఏ కొంతైనా తీర్చటానికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు తోటివారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
 
కుంభం :- వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలకు అయిన వారి ఆదరణ లభిస్తుంది. క్రీడ, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహరాలు వాయిదాపడటం మంచిదని గమనించండి. మీ సంతానం ఉద్యోగ యత్నాలపై దృష్టిసారిస్తారు.
 
మీనం :- పత్రిక, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. రుణం చెల్లించి రుణదాతలను సంతృప్తిపరుస్తారు. బ్యాంకింగ్ వ్యవహరాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. అధికారుల హోదా పెరగటంతో పాటు స్థాన చలనం తప్పదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14-10-2022 శుక్రవారం దినఫలాలు - మహాలక్ష్మీని ఎర్రని పూలతో ఆరాధించినా...