Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-10-2022 సోమవారం దినఫలాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా మీకు శుభం...

Advertiesment
Astrology
, సోమవారం, 10 అక్టోబరు 2022 (03:00 IST)
మేషం :- కుటుంబ సభ్యులు, అయిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. గత అనుభవంతో ఒక సమస్యను అధిగమిస్తారు. స్త్రీలు అకారణంగా మాటపడవలసి వస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. పొగడ్తలు, ప్రలోభాలకు లొంగవద్దు. లక్ష్య సాధనకు సానుకూల భావంతో యత్నాలు సాగించండి.
 
వృషభం :- వ్యాపారులు పనివారల తీరును గమనిస్తుండాలి. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పెద్దమొత్తం నగదు తీసుకునే విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఉద్యోగస్తులకు అధికారుల బదిలీ ఉపశమనం కలిగిస్తుంది. సేవ సంస్థల్లో సభ్యత్వం స్వీకరిస్తారు. అధికారులకు ఆకస్మిక స్థానచలనం, బాధ్యతల మార్పుతప్పవు.
 
మిథునం :- సంగీత, నృత్య కళాకారులకు ప్రశంసలు లభిస్తాయి. మీ శ్రీమతి మొండివైఖరి మనస్థాపం కలిగిస్తుంది. కొన్ని విషయాల్లో సర్దుకుపోవలసి ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. స్థిరచరాస్తుల మూలక ధనం అందుతుంది. ఫైనాన్స్, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు నూతన ఉత్సాహం కానవస్తుంది.
 
కర్కాటకం :- ఉద్యోగినులకు అధికారుల వేధింపులు, సహోద్యోగుల మాటతీరు ఆందోళన కలిగిస్తాయి. దైవకార్యాలు, దీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు సరుకు నిల్వలో జాగ్రత్త వహించాలి. గృహంలో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఓర్పుతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
 
సింహం :- వ్యాపారాల్లో పోటీ, షాపు పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువులు, అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి అవమానాలను ఎదుర్కొంటారు.
 
కన్య :- రావలసిన ధనం వాయిదా పడుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా దూరంగా ఉండటం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి.
 
తుల :- ఉపాధ్యాయులు అపరిచిత వ్యక్తులతో ఆచితూచి సంభాషించండి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగి వున్న పనులు పునఃప్రారంభమవుతాయి. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది.
 
వృశ్చికం :- ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆశాభంగం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఊహించని ఖర్చుల వల్ల ఆటుపోట్లు, చికాకులు ఎదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు.
 
ధనస్సు :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులెదుర్కోవలసి వస్తుది. వితండవాదం, భేషజాలకు దూరంగా ఉండటం ఉత్తమం. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
మకరం :- ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. ప్రేమికుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. ధనానికి ఇబ్బంది ఉండదు. ప్రయత్నపూర్వకంగా కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. స్త్రీలకు పొరుగువారిలో గుర్తింపు లభిస్తుంది.
 
కుంభం :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. రావలపిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. బంధువులకు ఆర్థికసాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, సదావకాశాలు లభిస్తాయి. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు కలిసిరాగలదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-10-2022 ఆదివారం దినఫలాలు-ఆదిత్య హృదయం చదివినా విన్నా..?