Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-10-2022 శనివారం దినఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో...

Advertiesment
kanya rashi
, శనివారం, 8 అక్టోబరు 2022 (04:00 IST)
మేషం :- ఒక స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన వాయిదా వేసుకోవటం శ్రేయస్కరం. ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశలు ఎదురవుతాయి.
 
వృషభం :- మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. సొంతంగా వ్యాపారం చేయాలన్నమీ కోరిక నెరవేరక పోవటంతో ఆందోళన చెందుతారు. సోదరుల సహకారంతో ఓ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు.
 
మిథునం :- మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. సేవ సంస్థల్లో సభ్యత్వం స్వీకరిస్తారు. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ద్విచక్ర వాహనం పై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. ప్లీడరు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
కర్కాటకం :- అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమికుల తొందరపాటుతనం అనర్ధాలకు దారితీస్తుంది. సోదరీ, సోదరులతో కలయిక, పరస్పర అవగాహన కుదురును. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయటంలో సహోద్యోగులు సహకరిస్తారు. అలౌకిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
సింహం :- నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలు, చెక్కుల జారీలో ఏకాగ్రత అవసరం. ఆకస్మిక మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంలో కొంత నిరుత్సాహనికి గురవుతారు. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు.
 
కన్య :- రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. అందరితో కలుపుగోలుగా మెలిగి మన్ననలు పొందుతారు. స్త్రీలకు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రాజకీయనాయకులు తరచూ సభలు సమావేశాలలో పాల్గొంటారు. గృహంలో మార్పులకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి.
 
తుల :- గత తప్పిదాలు పునరావృతంకాకుండా జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవటం ఉత్తమం. స్త్రీలకు ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు.
 
వృశ్చికం :- ప్రయాణాల్లో విలువైన వస్తువుల మరచిపోయే ఆస్కారం ఉంది. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పాత మొండి బాకీలు తీరుస్తారు. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయటంలో సహోద్యోగులు సహకరిస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
ధనస్సు :- ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. మీ ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. 
 
మకరం :- బంధువులను కలుసుకుంటారు. ఇంటా బయటా సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు.
 
కుంభం :- ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
మీనం :- మీ శ్రీమతి సలహా పాటించటం శ్రేయస్కరం. రాబోయే అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవటం క్షేమదాయకం. దూరప్రదేశంలోని ఆత్మీయులు, సంతానంతో సంభాషిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రదోష వ్రతం స్పెషల్ పూజలు.. పంచకవ్యాలతో అభిషేకాలు చేయిస్తే?