Webdunia - Bharat's app for daily news and videos

Install App

16-09-2022 శుక్రవారం దినఫలాలు - మహాలక్ష్మీని పూజించి, అర్చించిన శుభం...

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (04:00 IST)
మేషం:- ఆర్థిక విషయాల్లో స్పష్టంగా వ్యవహరించండి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. విందు, విలాసాలకు ధనం బాగుగా వ్యయం చేస్తారు. ఆడిటర్లు, బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ప్రైవేటు సంస్థల్లో వారికి కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి.
 
వృషభం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. భూవ్యవహరాల్లో రైతులకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. మీ సంతానానికి ఉన్నత విద్యకై చేయుయత్నాలు ఫలిస్తాయి. అనుకోని విధంగా ధనప్రాప్తి పొందుతారు. ఇంటా, బయట గౌరవం లభిస్తుంది. ముఖ్య విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించండి.
 
మిథునం :- ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీలు, లీజు పొడిగింపులకు అనుకూలం. దైవ దర్శనాలు అనుకూలం. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలో రాణిస్తారు.
 
కర్కాటకం :- ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీలు, లీజు పొడిగింపులకు అనుకూలం. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, బంగారు వ్యాపారాలు ఊపందుకుంటాయి. విందు, విహారయాత్రలతో కాలక్షేపం చేస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు.
 
సింహం :- ఆదాయంలో మార్పు మీకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చి పెడుతుంది. ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. సాంస్కృతిక, కళారంగాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య నుంచి బయటపడతారు.
 
కన్య :- వృత్తి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. మీ సమర్థతకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. రచయితలు, క్రీడ, కళాకారులకు ప్రోత్సాహకరం. మొహమాటాలకు దూరంగా ఉండాలి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు.
 
తుల :- వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. దైవదర్శనాలు చేస్తారు. ఎరువులు, విత్తన వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. ఊహించని ఖర్చు లెదురవ్వటంతో మీ చేతిలో ధనం నిలువదు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. రాజకీయనాయకులు కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
 
వృశ్చికం :- స్త్రీల కళాత్మతకు, ప్రతిభకు మంచి గుర్తింపు, పురస్కారాలు లభిస్తాయి. చేపట్టిన పనులు ప్రారంభంలో నెమ్మదించినా సమయానికి పూర్తిచేయ గలుగుతారు. వాతారణంలో మార్పు రైతులకు ఆందోళన కలిగిస్తుంది. వస్త్రాలు, విలువైన వస్తువుల కొనుగోళ్ళ నిమిత్తం ధనం విరివిగా వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు.
 
ధనస్సు :- ఆర్థిక విషయాల్లో కొంత సంతృప్తి కానవస్తుంది. విదేశీయానం చేయాటానికై చేయు యత్నాలలో సఫలీకృతులౌతారు. ఉద్యోగులకు, కళారంగాల్లో వారికి మార్పుల కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. అధిక ఒత్తిడి, శారీరక శ్రమ వల్ల అనారోగ్యం ఎదుర్కొంటారు. ముఖ్య విషయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు.
 
మకరం :- ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. విద్యార్థులకు క్రీడ, కళారంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు, వారసత్వ సంప్రదింపులు ఒక కొలిక్కి వస్తాయి. మీ కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. 
 
కుంభం :- వృత్తి, వ్యాపార రంగాల్లో వారి అంచనాలు, ఊహలు తారుమారయ్యే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ధనం రాకడ, పోకడ సరిసమానంగా ఉంటాయి. దైవ దర్శనాలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. దూరప్రయాణాలు మీకు అనుకూలించగలవు.
 
మీనం :- రావలసిన ధనం చేతికందడంతో మానసికంగా కుదుటపడతారు. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులలో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహా మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ రంగాల్లో వారి అంచనాలుఫలిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఏడాది 2025 ఫిబ్రవరి 1 నుంచి ఆంధ్రలో భూమి రిజిస్ట్రేషన్ ఫీజుల మోత

Telangana MLC Constituencies: తుది ఓటర్ల జాబితా విడుదల.. వివరాలివే..

Black Moon: డిసెంబర్ 31, 2024.. బ్లాక్ మూన్‌ని చూడొచ్చు.. ఎలాగంటే?

ఉగాది నుండి అమలులోకి మహిళలకు ఉచిత బస్సు పథకం?

అపుడు బూతులు తిట్టి.. ఇపుడు నీతులు చెబితే ఎలా? : పేర్ని నానిపై పవన్ కళ్యాణ్ ఫైర్ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

శనివారం ప్రదోషం: సాయంత్రం పాలు, పెరుగు అభిషేకానికి సమర్పిస్తే?

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

28-12-2024 శనివారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)

27-12-2024 శుక్రవారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments