Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-09-2022 ఆదివారం మీ రాశి ఫలితాలు... అమ్మవారికి గులాబీలు, చామంతులతో..?

Advertiesment
Astrology
, ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (05:00 IST)
అమ్మవారికి గులాబీలు, చామంతులతో అర్చన శుభదాయకం. 
 
మేషం:- విందులు, వినోదాలు బంధుమిత్రులతో గడుపుతారు. ధనం రాకడ పోకడ సరిసమానంగా ఉంటాయి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించ గలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది.
 
వృషభం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తులు, కేటరింగ్ రంగాల్లో వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థలలో ఉద్యోగం లభించే ఆస్కారం ఉంది. ముఖ్యుల ఆహ్వానాలుమిమ్మల్ని సందిగ్దానికి గురిచేస్తాయి. ఉద్యోగులకు అత్యుత్సాహం తగదు. దీర్ఘకాలిక రుణాలు ఒక కొలిక్కి చేరుతాయి.
 
మిథునం:- క్రీడ, కళా, శాస్త్ర రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉండగలవు. అవివాహితులకు కోరుకున్న సంబంధం నిశ్చయం కాగలదు. దూరప్రయాణాల్లో మెళకువ అవసరం. విద్యార్థులలో నూతనోత్సాహం నెలకొటుంది. బంధువుల రాకపోకలు మీకు శుభసూచకమవుతాయి.
 
కర్కాటకం:- ఉద్యోగ, ఉన్నత విద్యా యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. స్త్రీలకు ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యం అవసరం. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఒకింత ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
 
సింహం:- ఆర్థికంగా స్థిరపడతారు. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ధనం ఖర్చు చేసే వ్యవహారాల్లో ఆచి, తూచి వ్యవహరించండి. స్త్రీలకు బంధు వర్గాలతో పట్టింపులు, వ్యతిరేకతతప్పవు. దైవ దర్శనాలు, దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
కన్య: - రావలసిన ధనం వసూలు విషయంలో జాప్యం తప్పదు. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసేయత్నాలు ఫలిస్తాయి. ఓర్పు, పట్టదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ముఖ్యుల నుండి అందుకున్న ఆహ్వానాలు సంతోషపరుస్తాయి. క్రయవిక్రయాల్లో మెలకువ అవసరం.
 
తుల:- ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కానవస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధి కానరాగలదు. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
 
వృశ్చికం:- ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఆడంబరాలకు, విలాసాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రగతి పథంలో సాగుతాయి. పెద్దల మాట పెడచెవిన పెట్టి ఇబ్బందులకు గురికాకండి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు:- దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు, ప్రయత్నాలు ఉంటాయి. ఆరోగ్యంలో చికాకులు తప్పవు. విందు, వినోదాలలో కాలక్షేపం చేస్తారు. బంధువర్గాలు, సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. గతానుభవాలు జ్ఞప్తికిరాగలవు. నిరుద్యోగుల యత్నాలు కలిసిరాగలవు.
 
మకరం:- ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ రంగాల్లో వారికి కలిసిరాగలదు.మీ పాత సమస్యలు త్వరలోనే ఒక కొలిక్కి రాగలవు. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడటం మంచిది. కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటాయి. విదేశాలు, దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
కుంభం:- మిత్రులకిచ్చిన మాట కోసం శ్రమ, ప్రయాసలు పడవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు, వృత్తుల వారికి ఆశించినంత పురోగతి ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. కీలమైన వ్యవహారాల్లో మెలకువ వహించండి. 
 
మీనం:- వైద్య రంగాల్లో వారికి శస్త్రచికిత్సల విషయంలో ఏకాగ్రత అవసరం.చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల మధ్య అనుబంధాలు బలపడతాయి. నిర్మాణ పనులలో స్వయం వీక్షణ చాలా అవసరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు మీ వార రాశిఫలాలు